జగన్మోహన్ రెడ్డి సక్సెస్ ఫుల్ గా తన టార్గెట్ రీచైనట్లున్నారు. ఒకే ఒక దెబ్బతో ప్రతిపక్షాలను, ఎల్లోమీడియా అటెంన్షన్ మొత్తాన్ని డైవర్టు చేసేశారు. కొద్దిరోజులుగా టీడీపీతో కలిసి అన్నీ ప్రతిపక్షాలు+ఎల్లోమీడియా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వైఎస్ భారతి పేరును, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వం ఫెయిలైందని రకరకాలుగా కథనాలు, వార్తలు వండి వారుస్తున్న విషయం అందరు చూస్తున్నదే.






నిజానికి లిక్కర్ స్కామ్ లో భారతి పేరును ఈడీ ఎక్కడా ప్రస్తావించలేదు. అయినా జగన్ను గబ్బుపట్టించే ఉద్దేశ్యంతోనే భారతి పేరును టీడీపీ రోడ్డుమీదకు ఈడ్చింది. ఇక పోలవరం ప్రాజెక్టులో తన అవినీతి, అక్రమాలు, నాసిరకం వ్యవహారాలు వెలుగుచూడకుండా 24 గంటలూ జగన్ ఫెయిల్యూరన్నట్లుగా టీడీపీ చిత్రీకరిస్తోంది. దీనికి ఎల్లోమీడియా విపరీతంగా పబ్లిసిటీ ఇస్తోంది. అలాగే అప్పులు, ఇతరత్రా డెవలప్మెంట్ల విషయంలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్దేశ్యపూర్వకంగా కథనాలు అచ్చేస్తోంది ఎల్లోమీడియా.






ఇవన్నీ ఒకవైపు జరుగుతుండగానే సడెన్ గా జగన్ హెల్త్ యూనివర్సిటికి ఎన్టీయార్ పేరు తీసేసి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టారు. దాంతో టీడీపీ, ఎల్లోమీడియాకు ఒళ్ళుమండిపోయింది. వెంటనే తమ ప్రతాపాన్ని బుధవారం సాయంత్రం నుండి వార్తలు, కథనాలు, టీవీల్లో డిబేట్లు మొత్తం ఎన్టీయార్, వైఎస్సార్, జగన్ చుట్టూనే తిరుగుతున్నది. బహుశా ఇలాంటి డిబేట్లు మరో రెండుమూడురోజులు కంటిన్యు అయ్యే  అవకాశముంది.






అంటే టీడీపీ, ఎల్లోమీడియా అటెన్షన్ మొత్తాన్ని జగన్ ఒకవైపు నుండి నూరుశాతం మరో వైపుకు తిప్పేశారు. దాంతో జగన్ ప్లాన్ పూర్తిగా  వర్కవుటైనట్లే ఉంది. నిజానికి ఎన్టీయార్ పేరు తీసేసి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టడం వల్ల పార్టీకి జరిగే లాభం ఏమీ ఉండదని జగన్ కు అంతమాత్రం తెలీదా ? లాభం లేకపోతే ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందని కూడా తెలుసు. అయినా తాను అనుకున్నదే చేశారంటే ఏదో లెక్కప్రకారమే పావులు కదిపారు. ఆ లెక్క ఏమిటో మెల్లిగా తెలుస్తుంది కానీ ఇఫ్పటికిప్పుడు తెలీదు. చూద్దాం చివరకు ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: