కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలు పెంపు పై కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే..ఎప్పటి నుంచో డీఏ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.జులై నెలలోనే డీఏ పెరగాల్సి ఉంది కానీ.. కేంద్రం పెంచలేదు. దీంతో గత రెండు నెలల నుంచి ఎప్పుడు డీఏ పెరుగుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. మీడియా కథనాల ప్రకారం.. డీఏ పెంపుపై త్వరలోనే కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. నవరాత్రుల సందర్భంగా దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ బొనాంజా ఇవ్వడం కోసం కేంద్రం యోచిస్తుంది.


అందుకే సెప్టెంబర్ 28న డీఏ పెంపుపై ప్రకటన చేసే అవకాశం ఉంది.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 34 శాతంగా ఉంది. ఈసారి 4 శాతం పెంచే అవకాశం ఉంది. కేంద్రం 4 శాతం డీఏను పెంచితే మొత్తం 38 శాతం డీఏ కానుంది. నిజానికి ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను రెండు సార్లు సవరిస్తారు. ఈ సంవత్సరం జనవరిలో సవరించాల్సిన డీఏను మార్చిలో సవరించింది. ఆ తర్వాత జులైలో సవరించాలి కానీ.. రెండు నెలల తర్వాత సెప్టెంబర్ లో సవరించబోతోంది. మార్చిలో 31 నుంచి 34 శాతానికి డీఏ పెరిగింది.


ఇది ఇలా వుండగా డీఆర్ కూడా 3 శాతం పెరిగింది. దీని వల్ల 1.16 కోట్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరింది. జనవరి 1, 2022 నుంచి డీఏ పెంపు అమలులోకి వచ్చింది. ఏడో వేతన సంఘం సిఫారుసుల మేరకు డీఏను కేంద్రం పెంచుతోంది. ఈసారి 34 నుంచి 38 శాతానికి కూడా ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకే కేంద్రం పెంచనుంది. గత ఏప్రిల్ 2022 లో ఆల్ ఇండియా సీపీఐ ఐడబ్ల్యూ 1.7 పాయింట్లు పెరిగింది. 127.7 పాయింట్ల వద్ద నిలిచింది. గత మేలో ఏఐసీపీఐ ఫిగర్స్ 129 కాగా, జూన్ లో ఏఐసీపీ ఇండెక్స్ 129 కి చేరుకోగా,అదే విధంగా డీఏను 4 శాతం పెంచాలని కేంద్రం ఆలోచిస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: