ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన విషయం తెలిసిందే. కాగా కుప్పం మాజీ సీఎం మరియు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కావడం విశేషం. ఇందులో భాగంగా జగన్ వైఎస్సార్ చేయూత మూడవ విడుతకు సంబంధించిన నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముందు జగన్ చేసిన ప్రసంగం అంతా తీక్షణంగా గమనిస్తే కేవలం మహిళలు లక్ష్యంగా చేసుకుని తన వాణిని వినిపించారు. అయితే ఈ సమయంలో సీఎం జగన్ ఏమి మాట్లాడినా రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడుతారన్న విషయం తెలియందికాదు.

అందులో భాగంగానే జనవరి నుండి ఫించన్ ను పెంచుతున్నారు. పింఛన్ పెరుగుదలతో అధికాశా 2750 కానుంది. వాస్తవంగా మానిఫెస్టోలో చెప్పిన విధంగానే జగన్ చేస్తున్నారు. జగన్ మాట్లాడుతూ ఇది కేవలం మహిళల కోసమే కొనసాగుతున్న ప్రభుత్వం అంటూ చాటి చెప్పారు. అంతే కాకుండా ప్రభుత్వం అందించిన ప్రతి ఒక్క సంక్షేమ పధకం కూడా గత ప్రభుత్వాల లాగా మధ్యవర్తుల పాలు కాకుండా... డైరెక్ట్ గా లబ్దిదారులకు అందేలా జాగ్రత్తలు తీసుకున్నామని గర్వంగా చెప్పారు. ఆ విధంగా ఈ సభలో మహిళల కోసం చేసిన అన్ని పధకాలను వివరించి మరోసారి తనకే ఓటు వేయాలని పరోక్షముగా మహిళల మనసులో నాటుకుపోయేలా చెప్పడంలో జగన్ సఫలీకృతుడయ్యాడని చెప్పాలి.  

ఇక ఇప్పటికీ ఏపీలో జరిగిన ఎన్నికల సర్వే ప్రకారం మళ్ళీ గెలిచేది జగన్ అంటూ తెలుస్తోంది. కాగా మరికొన్ని సర్వేలు ఓడిపోయే ఛాన్స్ కూడా లేకపోలేదు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ గెలుపు దక్కాలంటే మహిళల ఓట్లు చాలా కీలకం కానున్నాయి.  మరి జగన్ పాలనలో అక్కచెల్లెమ్మలు సంతోషపడ్డారా ? సంతృప్తిగా ఉన్నారా ? అన్నది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: