హెల్త్ యూనివర్సిటి పేరుమార్పు నేపధ్యంలో పాత పురాణమంతా ఇపుడు మళ్ళీ బయటకు వస్తోంది. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరును తీసేసి డాక్టర్ వైఎస్సార్ పేరును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖాయంచేసింది. దీంతో చంద్రబాబునాయుడు అండ్ కో ఎన్టీయార్ వారసుల్లో కొందరు+ఎల్లోమీడియా  నానా రచ్చచేస్తున్నారు. జగన్ను పట్టుకుని నానాతిట్లు తిడుతున్నారు. హెల్త్ యూనివర్సిటికీ ఎన్టీయార్ పేరుతీసేసి డాక్టర్ వైఎస్సార్ పేరు ఎందుకు పెట్టాల్సొచ్చిందనే విషయమై జగన్ పెద్ద వివరణే ఇచ్చారు.





నిజానికి జగన్ ఇచ్చిన వివరణ ఎంతమాత్రం సమర్ధనీయంకాదు. ఏదో తనను తాను సమర్ధించుకోవటానికి మద్దతుగా జగన్ కారణాలు చెప్పుకుంటున్నారు. నిజానికి హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరా లేకపోతే వైఎస్సార్ పేరు ముఖ్యంకాదు. హెల్త్ యూనివర్సిటీ ద్వారా జనాలకు అందుతున్న సేవలు ఇక్కడ ముఖ్యం. సరే ఈ వివాదాన్ని వదిలేస్తే అసెంబ్లీ మాట్లాడిన జగన్ ఒకమాటన్నారు. అదేమిటంటే ఎన్టీయార్ మీద చంద్రబాబుకన్నా తనకే ఎక్కువ ప్రముందన్నారు. అందుకనే విజయవాడ జిల్లాకు ఎన్టీయార్ పేరుపెట్టినట్లు చెప్పారు.






అసలు రచ్చంతా ఇక్కడే మొదలైంది. పేరు మార్పు రాజకీయం నేపధ్యంలో పాత పురాణమంతా బయటకు వస్తోంది. 1995లో ఎన్టీయార్ ను చంద్రబాబు+ఎన్టీయార్ సంతానం+ఎల్లోమీడియా కలిపే వెన్నుపోటు పొడవటం, పార్టీని లాగేసుకోవటం, ఎన్టీయార్ మానసికక్షోభతో చనిపోవటానికి కారకులవ్వటం అంతా చర్చ జరుగుతోంది. పైరో హోటల్ ముందు నడీరోడ్డులో ఎన్టీయార్ ను చంద్రబాబు+దగ్గుబాటి+ఎన్టీయార్ వారసులంతా కలిసి చెప్పులతో కొట్టించిన ఘట్టాలపై ఇపుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది.






అలాగే చంద్రబాబు హయాంలో వైఎస్సార్ పేరు  తీసేసి ఎన్టీయార్ పేరు పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం లాంటివి కూడా బయటకు వస్తున్నది. చంద్రబాబు సీఎం కాగానే పార్టీ సభ్యత్వ నమోదు పుస్తకాల్లో ఎన్టీయార్ ఫొటో తీయించేసింది, పార్టీ ఆఫీసులో ఎన్టీయార్ ఫొటోలు తీయించేసింది, పార్టీ వెబ్ సైట్లో ఎన్టీయార్ ఫొటును తీయించేసిన విషయాలన్నీ ఇపుడు బయటకు వస్తున్నాయి. దీంతో అసలు ఎన్టీయార్ కు అవమానం జరిగింది జగన్ వల్లా లేకపోతే చంద్రబాబు+ఎన్టీయార్సంతానం+ఎల్లోమీడియావల్లా అనేవిషయాలపై జనాల్లో చర్చ మొదలైంది. చర్చ మంచిదేకదా అన్నీ విషయాలు జనాలకు తెలుస్తాయి.


 

మరింత సమాచారం తెలుసుకోండి: