హెల్త్ యూనివర్సిటీకి తన తండ్రి ఎన్టీయార్ పేరును తీసేసి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టడంపై నందమూరి బాలకృష్ణ స్పందించారు. స్పందన కూడా చాస్త ఘాటుగానే ఉంది. అయితే బాలయ్య ట్విట్లో చేసిన విమర్శలు, ఘాటు స్పందనలు ఎవరిని ఉద్దేశించి అన్నదే అర్ధం కావటంలేదు. చెప్పేదేదో డైరెక్టుగా చెప్పకుండా పరోక్షంగా కెమెంట్లు చేయటం వల్లే రకరకాలుగా వైరల్ అవుతున్నది. మార్చెయ్యటానికి, తీసేయటానికి ఎన్టీయార్ అన్నది పేరుకాదు. ఓ సంస్కృతి, ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక అన్నారు.






నిజానికి ఇందులోనే బోలెడు అభ్యంతరాలున్నాయి. సంస్కృతి, నాగరికత ఎన్టీయార్ తో పుట్టలేదని బాలయ్యకు తెలీదేమో. ఇక తెలుగుజాతి వెన్నెముక అనటం కూడా కరెక్టు కాదు. అసలు తెలుగుజాతికి ఎన్టీయార్ కు ముడిపెట్టటమే చాలా తప్పు. సరే ఎవరి అభిమానం కొద్ది వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారని సరిపెట్టుకోవాల్సిందే. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్టు పేరుమారిస్తే కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటి పేరు మార్చాడంటు జగన్మోహన్ రెడ్డిని తప్పుపట్టడం డైరెక్టుగానే ఉంది.





అక్కడ ఆ మహనీయుడు పెట్టిన బిక్షతో బతుకుతున్న నేతలున్నారు, పీతలున్నారు..విశ్వాసంలేని వాళ్ళని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి..శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు  అంటు చేసిన వ్యాఖ్యలు ఘాటుగానే ఉన్నాయి. మహనీయుడు పెట్టిన బిక్షతో బతుకుతున్న నేతలున్నారు, పీతలున్నాయి అని ఎవరిని ఉద్దేశించి కామెంట్ చేసినట్లు ? వైసీపీలో మహనీయుడి బిక్షతో బతుకుతున్న నేతలెవరు ? టీడీపీలో నుండి వైసీపీలో చేరిన తమ్మినేని సీతారామ్, లక్ష్మీపార్వాతి లాంటి వాళ్ళగురించేనా బాలయ్య బాధంతా.





విశ్వాసంలేని కుక్కలంటే ఎవరు ? నిజానికి చంద్రబాబునాయుడు, బాలకృష్ణ లాంటి వాళ్ళు కూడా ఎన్టీయార్ పెట్టిన బిక్షతోనే ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. ఎన్టీయార్ దయతో రాజకీయాల్లో బాగా ఎదిగి చివరకు వెన్నుపోటు పొడిచి ఎన్టీయార్ నే పదవిలో నుండి దింపేసి, పార్టీని కూడా లాగేసుకున్నది చంద్రబాబు, బాలయ్య అండ్ కోనే కదా. మరి విశ్వాసం లేనిది ఎవరికి ? ఎన్టీయార్ విషయంలో వారసులు, కుటుంబసభ్యులకే లేని విశ్వాసం బయటనేతలకు ఎందుకుంటుంది ? అని జనాలు ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: