ఇప్పుడు డబ్బులను ఇన్వెస్ట్ చేయాలనీ అందరూ అనుకుంటారు. అయితే,ఎటువంటి వాటిలో డబ్బులను పెడితే సేఫ్ గా ఉంటుందనే విషయం తెలియక చాలా మంది నష్టపోతున్నారు..ఎటువంటి పథకాలలో పెడితే డబ్బులు పెడితే మంచి లాభాలు ఉంటాయో అని ఆలోచించే వారికి పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్ లను అందిస్తుంది.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..




పోస్టాఫీసులలో ఉండే స్కీమ్‌లలో కిసాన్ వికాస్ పత్ర ఒకటి. ఇది ప్రభుత్వ పథకం. ఇది కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో తపాలా శాఖ ద్వారా నిర్వహించబడుతుంది. భారీ మొత్తాన్ని ఏకమొత్తంలో డిపాజిట్ చేయకూడదనుకునే వారు, తమ పెట్టుబడులలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనుకునే వారు పెట్టుబడి పెట్టగల అటువంటి పథకం ఇది. పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో 9 చిన్న పొదుపు పథకాలు నడుస్తున్నాయి. ఈ పథకాలన్నీ వాటి స్వంత ప్రత్యేకతను కలిగి ఉంటాయి. వాటి స్వంత ప్రయోజనాలను కలిగి ఉంటాయి.


ఇందులో జమ చేసిన డబ్బు 124 నెలల్లో రెట్టింపు అవుతుంది. చాలా కాలం తర్వాత ఒకేసారి మొత్తం పొందాలనుకునే పెట్టుబడిదారులకు ఇది బెస్ట్ అనే చెప్పాలి.124 నెలల పాటు కేవీపీలో డబ్బు ఉంచినా, మధ్యలో డబ్బు తీసుకోకపోయినా, ఖాతా మూసివేయకపోయినా 10 సంవత్సరాల 4 నెలల్లో జమ చేసిన డబ్బు రెట్టింపు అవుతుంది. 6.9 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షలు కేవీపీలో డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీపై రూ.10 లక్షలు అందుకోవచ్చు. ఈ విధంగా అసలు మొత్తం రూ.5 లక్షలపై రూ.5 లక్షల వడ్డీ లభిస్తుంది.


మెచ్యూరిటీ వ్యవధి- ఈ కిసాన్ వికాస్‌ పత్ర పథకం కు చెందిన మెచ్యూరిటీ వ్యవధి 124 నెలలు. ఈ వ్యవధిని పూర్తి చేసిన తర్వాత మీరు మీ మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు. అయితే , మీరు మీ పెట్టుబడిని ఉపసంహరించుకోకూడదని నిర్ణయించుకుంటే, మీరు దానిని ఉపసంహరించుకునే వరకు అది వడ్డీని పొందుతూనే ఉంటుంది.


నిధి భద్రత- మీరు ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన ఫండ్ మార్కెట్‌లో ఎలాంటి అనిశ్చితి లేకుండా ఉంటుంది. పాలసీ వ్యవధి ముగింపులో, పెట్టుబడిదారుడు పూర్తి మొత్తాన్ని, ప్రయోజనాలను పొందేందుకు అర్హులు.
వడ్డీ రేటు- KVP పథకం ప్రస్తుతం సెప్టెంబర్ 2022 వరకు త్రైమాసికానికి 6.9% వడ్డీ రేటును కలిగి ఉంది. మీరు మీ డిపాజిట్‌పై ఎక్కువ రాబడిని పొందుతారు.
పన్ను ప్రయోజనాలు- ఈ స్కీమ్‌లో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఎలాంటి పన్ను మినహాయింపు ఉండదు. అందుకున్న రిటర్న్‌లు పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తాయి. అయితే TDS మెచ్యూరిటీ తర్వాత ఉపసంహరణ నుండి మినహాయించబడుతుంది.


ఒకవేళ డిపాజిట్ ను ఉపసంహరించుకుంటే 30 నెలల కాలవ్యవధి తర్వాతే డబ్బులను తీసుకోగలరు.మీరు KVP డబ్బును నగదులో డిపాజిట్ చేస్తే మీరు వెంటనే సర్టిఫికేట్ పొందుతారు. చెక్కు, మనీ ఆర్డర్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా డబ్బు డిపాజిట్ చేసినట్లయితే డబ్బు పోస్టాఫీసుకు చేరిన తర్వాత సర్టిఫికేట్ ను పొందుతారు..

మరింత సమాచారం తెలుసుకోండి: