మొదటినుండి చంద్రబాబునాయుడు వ్యవహారమే ఇంత. చాలా ఆర్భాటంగా మొదలుపెడతారు. మొదలుపెట్టి మధ్యలోనే వదిలేస్తారు. ఇక ఆ తర్వాత ఆ విషయాన్నే పట్టించుకోరు. చంద్రబాబు పిలుపువిని ఆవేశంతో  రంగంలోకి దూకినవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళపనై పోతుంది. ఇపుడు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరు తీసేసిన విషయమే తాజా ఉదాహరణ. రెండు రోజులుగా చంద్రబాబు అసలా విషయాన్నే ఎక్కడా ప్రస్తావించటంలేదు.

ఎన్టీయార్ పేరును యూనివర్సిటీకి తీసేసిన రోజునేమో చాలా భీకరమైన శపథం చేశారు. తీసేసిన ఎన్టీయార్  పేరును మళ్ళీ యూనివర్సిటీకి పెట్టేంతవరకు ఊరుకునేది లేదని ఎంతదాకా అయినా పోరాటాలు చేస్తామని చాలా గంభీరంగా ప్రకటించారు. చంద్రబాబు శపథం విని తమ్ముళ్ళల్లో కంగారు పుట్టింది నిజంగానే పోరాటాలు చేయాలేమో అని. నాలుగురోజులు అయ్యేసరికి తమ్ముళ్ళందరు అమ్మయ్య అనుకుంటున్నారు. ఎందుకంటే అసలు ఇష్యూని చంద్రబాబు వదిలేశారు కాబట్టి.

చంద్రబాబు ఎందుకు వదిలేశారంటే ఆయనకేమన్నా ఎన్టీయార్ అంటే ప్రేముందా ఇంకేమన్నానా. ఏదో ఎన్టీయార్ పేరుచెప్పుకుని నాలుగురోజులు ఏదో గోల చేద్దామని అనుకున్నారు. అయితే రెండోరోజే చంద్రబాబు ప్లానంతా రివర్సుకొట్టింది. ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడవటం, పార్టీని లాగేసుకోవటం, అధ్యక్షుడి దింపేయటం చివరకు మరణానికి కారణమవ్వటం అంతా జనాల్లో చర్చ మొదలైంది. వారసుల అండతో చంద్రబాబు+దగ్గుబాటి కలిసి ఎన్టీయార్ కు చేసిన ద్రోహాన్ని మంత్రులు, వైసీపీ సీనియర్ నేతలు జనాలకు అన్నీ విషయాలు చక్కగా వివరించి చెప్పారు.


దాంతో ఎన్టీయార్ కు వారసులు+తోడల్లుళ్ళు కలిసి చేసిన అవమానం, ద్రోహం ముందు యూనివర్సిటికీ పేరు తీసేయటం ఎంతనే చర్చ జనాల్లో మొదలైంది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి నూరుశాతం సక్సెస్ అయినట్లే. దానికి క్లైమ్యాక్సుగా దసరానవరాత్రుల సందర్భంగా విజయవాడ నగరంలోని చాలా ప్రాంతాల్లో పెద్ద పెద్ద పోస్టర్లు వెలిశాయి. ఆ పోస్టర్లేమిటంటే 1995లో ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడిచి సీఎం అయిన తర్వత చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో చంద్రబాబు ఏమిచెప్పారంటే ‘వుయ్ డోంట్ నీడ్ ఎన్టీయార్’ అని. అదిపుడు సోషల్ మీడియాలో  చాలా వైరల్ గా మారింది. దాంతో ఏమి మాట్లాడాలో అర్ధంకాక చంద్రబాబే అలవాటుగా ఇష్యూను వదిలేసి  యూ టర్న్ తీసేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: