గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ఆ శుభదినం మరెంతో దూరంలో లేదు..డీఏ పెరగనుంది. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడనే విషయంపై స్పష్టత వచ్చేసింది. సెప్టెంబర్ 28న (బుధవారం) ప్రధాని నరేంద్ర మోడీ డీఏ, డీఆర్ పెంపుపై ప్రకటన చేయవచ్చునని సంకేతాలు అందుతున్నాయి. 7వ వేతన సంఘం సిఫార్సు ప్రకారం 4 శాతం డీఏ పెంపునకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలుస్తుంది. అంటే సెప్టెంబర్ జీతం భారీగా రానుంది.


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కొత్త కరవు భత్యం జూలై 1, 2022 నుంచి వర్తించనుంది. అంటే సెప్టెంబర్ జీతంలో ఆ నెల పెరిగిన డీఏతో పాటు గత మూడు నెలల ఎరియర్లతో కలిపి లభిస్తుంది..ఈ నెల జీతం భారీగా జీతం పెరగనుంది..ఏఐసీపీఐ సూచీ ప్రకారమే డీఏ పెంపు ఉంటుంది. కార్మిక శాఖ లెక్కల ప్రకారం కరవు భత్యం ఆధారిత ఏడాది 2016లో మార్పు జరిగింది. వేజ్ రేట్ ఇండెక్స్ కొత్త సిరీస్ జారీ చేసింది. అంటే డబ్ల్యూఆర్ఐ కొత్త సిరీస్ 1963-65 పాత సిరీస్ స్థానంలో ఉంటుంది.


మేలో గణనీయంగా పెరిగింది. 1.3 పాయింట్లు పెరిగి 129కి చేరుకుంది. . మహమ్మారి కారణంగా.. ఆర్థిక మంత్రిత్వ శాఖ మే 2020లో DA పెంపును నిలిపివేసింది.మార్చి 30న చేసిన డీఏ పెంపు ప్రకటనతో 1.16 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలిగిన విషయం తెలిసిందే.ప్రస్తుతం కేంద్రప్రభుత్వ ఉద్యోగుల డీఏ రేటు 34 శాతంగా ఉంది. 7వ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా డీఏని ఏడాదిలో రెండుసార్లు సవరించడంతో ఈ స్థాయిలో ఉంది. మొదటసారి జనవరి నుంచి జూన్‌ వరకు,రెండోసారి జులై నుంచి డిసెంబర్ వరకు కేంద్రం పెంచింది. ఈ 4% కరువు భత్యం పెంపు తో ఉద్యోగులకు వార్షికంగా కనీసం రూ. 8640 నుంచి గరిష్టంగా రూ. 27,312 లవరకు వేతనంలో పెరుగుదల ఉండనుందని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: