ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ సర్కార్ అదిరిపోయే దసరా కానుకను అందించారు.వేలాదిమంది ఉద్యోగుల కలను సాకారం చేశారు.అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ఇక అధికారికంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందనున్నారు. పీఆర్సీ కలిపిన కొత్త జీతాలను వారు అందుకోబోతోన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తోన్నారు.ప్రమోషన్ తీసుకున్న 2,094 మందికి మినహా మిగిలిన వారందరికీ అక్టోబర్‌ 1వ తేదీ నుంచి కొత్త వేతనాలు అందుతాయి. పదోన్నతి పొందిన వారికి నవంబర్‌ 1వ తేదీ నుంచి పీఆర్సీతో కూడిన వేతనాలు చెల్లిస్తుంది ప్రభుత్వం.


పీఆర్సీ అమలు చేయడం వల్ల ఒక్కో ఉద్యోగి జీతంలో కనీసం 3,000 నుంచి 6,000 రూపాయలు పెరుగుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఏపీఎస్ఆర్టీసీ లో పని చేస్తోన్న సుమారు 52 వేల మందికి పైగా ఉద్యోగులకు లబ్ది చేకూరుతుంది. ఏపీ ప్రజా రవాణా శాఖ వైఎస్సార్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిశారు. కృతజ్ఞతలు తెలిపారు. తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తాము కూడా జీతాలు అందుకోబోతోండటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు..


ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేశామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అదే సమయం లో డీజిల్ రేటు భారీగా పెరిగిపోవడం, చరిత్ర లో ఎప్పుడూ లేనివిధంగా లీటర్ 100 రూపాయలను దాటిన పరిస్థితి ఏర్పడటం, బస్సుల నిర్వహణ వంటి కారణాల తో పీఆర్సీని అమలు చేయడం ఆలస్యమైంది. ఈ అదనపు ఆర్థిక భారం వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు సకాలం లో పీఆర్సీని ఇవ్వలేక పొయినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు అయిన మరుసటి సంవత్సరమే అంటే 2020 జనవరి 1వ తేదీ నుంచి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తోన్నట్లు ప్రభుత్వం అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే..ఈ వార్త తో ఉద్యోగులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: