కేంద్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి మోదీ ఎన్నో పథకాలను అందుబాటు లోకి తీసుకొని వస్తున్నారు..అందులో కొన్ని పథకాలు రైతులకు లబ్ది చేకూరుస్తున్నాయి. అందులో ఒకటి కిసాన్ సమ్మాన్ నిధి పథకం.. ఈ పథకం ద్వారా ఏడాదికి 6 వేలు రైతుల ఖాతా లోకి వెళుతూంది.. ఇప్పటికే 11 విడతల డబ్బులు రైతుల ఖాతాలోకి పడింది.. ఇప్పుడు 12 విడత డబ్బులు జమకానున్నాయి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్దిదారుడా..


కిసాన్ యోజన సొమ్ము మీ అకౌంట్‌లో జమ అవుతోందా.. అయితే మీకోసం ఓ బిగ్ అలెర్ట్. పీఎం కిసాన్ యోజన స్కీంమ్‌ లో కేంద్ర ప్రభుత్వం పలు కీలకమైన మార్పులు చేసింది..ఇకపై కిసాన్ యోజన సొమ్ము అకౌంట్‌ లోకి బదిలీ అవ్వాలంటే.. రేషన్ కార్డు నెంబర్ నమోదు తప్పనిసరి అని సూచించింది. పీఎం కిసాన్ యోజన ప్రయోజనాలు పొందాలన్నా.. కిసాన్ యోజనలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా.. ఇకపై రేషన్ కార్డు నెంబర్‌ను పీఎం కిసాన్ పోర్టల్‌లో నమోదు చేయించుకోవాల్సిందే.


రేషన్ కార్డుకు సంబంధించిన సాఫ్ట్ కాపీని పీడీఎఫ్ రూపంలో పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. అంతేకాకుండా కేవైసీ ప్రక్రియ ను సైతం పూర్తి చేయాలి. కాగా, పీఎం కిసాన్ యోజన డబ్బు.. రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ కావాలంటే.. బ్యాంక్ అకౌంట్ నెంబర్ నమోదు చేయడం తప్పనిసరి.. అంతే కాకుండా ఆధార్ కార్డు కూడా ఉండాల్సిందే. ఒకవేళ ఆధార్ లేకుంటే.. ఈ పధకం ప్రయోజనాలు అందవు. అటు పీఎం కిసాన్ 12వ విడత డబ్బులు.. సెప్టెంబర్ 30వ తేదీన రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.. ఏది ఏమైనా కిసాన్ డబ్బులు రైతుల అకౌంట్ లోకి రావడానికి ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి వాటికి అప్డేట్ చేసుకుంటే డబ్బులు పడనున్న సంగతి తెలిసిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: