దగ్గుబాటి ఫ్యామిలీలో అయోమయం మొదలైందా ? తాజా పరిణామాలను బట్టిచూస్తే అందరిలోను ఇదే అనుమానాలు మొదలయ్యాయి. ఇంతకీ దగ్గుబాటి ఫ్యామిలీలో అయోమయం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో ఎక్కడినుండి పోటీ చేయాలనే విషయం మీదే. పోయిన ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గంలో  వైసీపీ తరపున పోటీచేసి ఓడిపోయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు తర్వాత పార్టీకి దూరమైపోయారు. కొంతకాలం కామ్ గా ఉన్న తర్వాత ఇపుడు మళ్ళీ టీడీపీకి దగ్గరవుతున్నారు.





ఎన్టీయార్ కు వెన్నుపోటు తర్వాత పరిణామాల కారణంగా చంద్రబాబునాయుడు-దగ్గుబాటి ఫ్యామిలి మధ్య విభేదాలు మొదలయ్యాయి. తాజా పరిణామాల కారణంగా మళ్ళీ వీళ్ళిద్దరు ఒకటవుతున్నారు. ఈ నేపధ్యంలోనే తన కొడుకు హితేష్ చెంచురామ్ ను వచ్చే ఎన్నికల్లో పోటీచేయించాలని వెంకటేశ్వరరావు అనుకున్నారు. ఇందుకు టీడీపీనే అనువైన పార్టీగా డిసైడ్ అయినట్లున్నారు. వైసీపీ తరపున పోటీచేయలేరు. బీజేపీ తరపున పోటీచేసి ఉపయోగంలేదు. జనసేనలోకి వెళ్ళలేరు. 




సో మిగిలింది టీడీపీ మాత్రమే. పైగా రెండు ఫ్యామిలీలు కలిసిపోతున్నాయి కాబట్టి టీడీపీ తరపునే పోటీచేయించాలని అనుకున్నారు. ఇందుకు చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అందుకనే తమ నియోజకవర్గమైన పర్చూరులోనే కొడుకు పోటీచేయాలని దగ్గుబాటి అనుకున్నారు. అయితే సిట్టింగులకే టికెట్లని చంద్రబాబు ప్రకటించటంతో పర్చూరు టికెట్ సాధ్యంకాదని తేలిపోయింది. సరే చీరాలయినా పర్వాలేదని దగ్గుబాటి అనుకున్నారట. అయితే చంద్రబాబు చేసిన ప్రకటనతో చీరాలలో కూడా అవకాశం లేదని తేలిపోయింది.





దగ్గుబాటి ఫ్యామిలీ టీడీపీకి దగ్గరవుతోందనే సంకేతాలు చూడగానే పార్టీలోని నేతల్లో అభద్రత మొదలైందట. ముఖ్యంగా చీరాల నేతల్లో. ఇందుకనే తమకు క్లారిటి కావాలని నేతలు చంద్రబాబును అడిగారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు మాట్లాడుతు నియోజకవర్గం ఇన్చార్జిగా కొండయ్యే ఉంటారని ప్రకటించారు. కొత్తవాళ్ళు వచ్చినంత మాత్రాన ఇన్చార్జిలు మారరని కూడా హామీ ఇచ్చారు. మరి పర్చూరులో అవకాశం లేక చీరాలలో కూడా చాన్సులేకపోతే తామెక్కడ నుండి పోటీచేయాలనేది దగ్గుబాటి కుటుంబంలో అయోమయం మొదలైందట. జిల్లాలో ఇంకే నియోజకవర్గం ఉందో తెలీటంలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: