ఈమధ్యనే చనిపోయిన కృష్ణంరాజు కుటుంబానికి ప్రభుత్వం అపరిమితమైన ప్రాధాన్యతిస్తోంది. సినీనటడుడుగా ఉంటూనే కృష్ణంరాజు రాజకీయాల్లో కూడా కొంతకాలం బిజీగా గడిపారు. కాంగ్రెస్ పార్టీ తో మొదలైన రాజకీయ జీవితం తర్వాత బీజేపీ ఆ తర్వాత పీఆర్పీలో కూడా కంటిన్యు అయ్యింది. అయితే ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు కానీ మళ్ళీ గాలిమళ్ళి కమలంపార్టీలోనే చేరారు. 1998లో ఎంపీగా గెలిచిన కృష్ణంరాజు వాజ్ పేయి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.




చనిపోయేనాటికి బీజేపీలోనే ఉన్నారని చెప్పుకోవాలంతే. అయితే ఇపుడు విషయం ఏమిటంటే ఈమధ్యనే చనిపోయిన కృష్ణంరాజు పేరుతో స్మృతివనం నిర్మించాలని ఆయన కుటుంబసభ్యులు అనుకున్నారు. కుటుంబసభ్యులంటే సినీ సెలబ్రిటీ కాబట్టి  ప్రభాస్ ఒక్కడే అందరికీ తెలిసిన వ్యక్తి. కుటుంబసభ్యులు అనుకోవటమే ఆలస్యం ప్రభుత్వం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. నరసాపురంకు దగ్గరలోనే ఉన్న పేరుపాలెం బీచ్ ప్రాంతంలో రెండు ఎకరాలు కావాలని కుటుంబం అడిగిందనే ప్రచారం మొదలైంది.




కుటుంబం అడగటమే ఆలస్యం ప్రభుత్వం వెంటనే ఓకే చెప్పేసింది. ఎక్కడ కావాలో కుటుంబం ఫైనల్ చేస్తే వెంటనే స్ధలాన్ని ఇవ్వటానికి ప్రభుత్వం రెడీగా ఉందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. నిజానికి ప్రభాస్ స్ధాయికి ప్రభుత్వం నుండి స్ధలం తీసుకోవాల్సిన అవసరమేలేదు. అయినా కుటుంబం అడగటం, ప్రభుత్వం ఓకే చేయటం వెంటవెంటనే జరిగిపోయింది.




ఇదంతా చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో క్షత్రియుల మద్దతు కోసమేనా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. కృష్ణంరాజు ఏ పార్టీలో ఉన్నా వివాదాలకు అతీతంగా ఉండేవారు. అలాగే ప్రభాస్ కూడా రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాపులు+రాజుల మద్దతుతో రాజకీయం చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్లాన్ చేస్తున్నారు. ఇదే పద్దతిలో చంద్రబాబు కూడా వ్యూహాలు పన్నుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా వెంటనే మేల్కొన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రభాస్ సోదరుడు బీజేపీ తరపున నరసాపురం నుండి బీజేపీ ఎంపీగా పోటీచేస్తారని ప్రచారంలో ఉంది. మరి ఏది కరెక్టో కాలమే నిర్ణయించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: