సుకన్య సమృద్ధి యోజన పథకంలో లేదా పీఎఫ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్..ఈ విషయం తెలుసుకోవాల్సిందే. కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లు పెంచేసింది. అయితే ఇక్కడ మోస్ట్ పాపులర్ స్కీమ్స్ విషయంలో మాత్రం మొండి చెయ్యి చూపించింది..వడ్డీ రేట్ల పెంపు కేవలం కొన్ని స్కీమ్స్‌కు మాత్రమే వర్తింపజేసింది.



కొంత మందికి మాత్రమే బెనిఫిట్ కలుగనుంది. వడ్డ రేట్ల పెంపు నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమలు లోకి వస్తుంది. డిసెంబర్ చివరి వరకు కొత్త వడ్డీ రేట్లు అమలులో ఉంటాయి. వడ్డీ రేటు పెంపు 0.1 శాతం నుంచి 0.3 శాతం వరకు ఉంది.పీఎఫ్ డిపాజిట్ పై వడ్డీలో ఎటువంటి మార్పు లేదు. చాలా పాపులర్ అయిన సుకన్య సమృద్ధి యోజన పథకంపై కూడా వడ్డీ రేటు స్థిరంగా ఉంది. 7.6 శాతంగా వద్దనే నిలకడగా కొనసాగుతోంది.


నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై కూడా వడ్డీ రేటులో మార్పు లేదు. 6.8 శాతంగా ఉంది. రెండేళ్ల టర్మ్ డిపాజిట్‌ పై వడ్డీ రేటు 5.5 శాతం నుంచి 5.7 శాతానికి చేరింది. మూడేళ్ల టైమ్ డిపాజిట్లపై అయితే వడ్డీ రేటు 5.8 శాతానికి చేరింది. ఇదివరకు వడ్డీ రేటు 5.5 శాతంగా ఉంది.. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేటు 7.4 శాతం నుంచి 7.6 శాతానికి చేరింది. అలాగే మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్ స్కీమ్‌పై కూడా వడ్డీ రేటు పెరిగింది. 6.6 శాతం నుంచి 6.7 శాతానికి చేరింది. ఇంకా కిసాన్ వికాస్ పత్ర పథకం పై కూడా వడ్డీ రేటు పైకి చేరింది..కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో కొందరికి బెనిఫిట్ ఉన్నా కూడా మరి కొంతమందికి ఎటువంటి ప్రయోజనం వుండదు..

మరింత సమాచారం తెలుసుకోండి: