ప్రస్తుతం తెలంగాణాలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్న రాజకీయ అంశం ఏదైనా ఉంది అంటే... అది నల్గొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక గురించే అని చెప్పాలి. కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత నెలలో పార్టీలో కొందరితో పొసగక పార్టీకి మరియు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. అయితే ఇప్పుడు బీజేపీలోకి వెళ్లిన రాజగోపాల్ రెడ్డికి ఈ ఎన్నికలో గెలవడం చాలా అవసరం లేదంటే... రాజకీయంగా బలహీనం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కొత్త పార్టీలోకి ఇతర పార్టీ వాళ్ళు చేరినప్పుడు సాధారణంగానే సరైన గుర్తింపు మరియు మద్దతు దొరకడం చాలా కష్టం.

అందుకే ఎంతో ప్రతిష్టాత్మకం అయిన ఈ ఎన్నికలో గెలవాలని రాజగోపాల్ రెడ్డి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గెలుపును అడ్డుకునే శక్తి ఒక్క కాంగ్రెస్ కే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ కు ఇది సిట్టింగ్ స్థానం కావడం మరియు రేవంత్ రెడ్డి రూపంలో బలమైన పీసీసీ అధ్యక్షుడు ఉండడం నిజంగా సానుకూలమైన అంశాలు అని చెప్పాలి. కాంగ్రెస్ నుండి పాల్వాయి స్రవంతి ఈ ఉప ఎన్నికలో పోటీ చేయనుంది. ఇక తెరాస ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు.

జరుగుతున్న పరిణామాలను మరియు పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తే బీజేపీ కి ప్రజల్లో అంతగా ఆదరణ దక్కడం లేదు అన్నది నిజం. ఇందుకు కారణాలు చెప్పుకోవాలంటే చాలానే ఉన్నాయి. అసాధారణంగా పెరిగిన నిత్యావసర ధరలు వలన మధ్యతరగతి మరియు నిరుపేద ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అందుకే బీజేపీ పై కోపంతో రగిలిపోతున్నారు. అయితే... ఇంతకు ముందు తెలంగాణలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచింది, ఆ నమ్మకంతోనే ఆ పార్టీ నాయకులు గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ రెండు గెలుపులు కూడా సరైన ప్రత్యర్థి లేక గెలిచినవే అని తెలిసిందే. మరి ఈ ఎన్నిక రాజగోపాల్ రెడ్డి రాజకీయ జీవిహానికి ముగింపు పలుకుతాయా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: