తమ అధినేత దారిలోనే నేతలు ప్రయాణిస్తు  ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తుంటే ఎవరైనా సంతోషించాల్సిందే. కానీ ఇక్కడ రివర్సులో చంద్రబాబునాయుడు మాత్రం తమ్ముళ్ళపై మండిపోతున్నారు. జనాల్లోకి ఎందుకు వెళ్ళటంలేదని నేతలకు క్లాసులు పీకుతున్నారు. మంత్రులు, ఎంఎల్ఏలుగా పనిచేసిన వాళ్ళు కూడా జనాల్లోకి వెళ్ళకపోతే ఎలాగంటు నిలదీస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై జనాలను కూడదీసుకుని  ప్రభుత్వాన్ని నిలదీయకపోతే ఎలాగంటు మండిపోతున్నారు.





ఇదంతా గుంటూరు జిల్లా నేతల సమీక్షలో జరిగింది. అంతకుముందు కృష్ణా జిల్లా నేతల రివ్యూ సందర్భంగా కూడా చంద్రబాబు ఇలాగే క్లాసుపీకారు. అంతకుముందొకసారి చిత్తూరు నేతల సమీక్షలో కూడా తమ్ముళ్ళ పనితీరుపై  చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలే చేశారు. అంటే ఏ జిల్లాలో నేతలు కూడా జనాల్లోకి పెద్దగా వెళ్ళటం లేదన్న విషయం అర్ధమవుతోంది. ప్రతిపక్షంలో ఉండి తమ్ముళ్ళు జనాల్లోకి ఎందుకు వెళ్ళటంలేదు ?





ఎందుకంటే జనాల్లోకి వెళ్ళడంకన్నా మీడియాలో హైలైట్ అయితే చాలన్న విషయాన్ని తమ్ముళ్ళు బాగా అలవాటుచేసుకున్నారు. తమ్ముళ్ళకు ఈ అలవాటు ఎక్కడినుండి వచ్చిందంటే చంద్రబాబును చూసే నేర్చుకున్నారు. మొదటినుండి చంద్రబాబు అనుసరిస్తున్న మార్గమే ఇది. సమస్య ఏమిటంటే మొదటినుండి కూడా చంద్రబాబు జననేత కాదు. మీడియాను మ్యానేజ్ చేసుకుంటు ప్రచారం పొందుతు హైలైట్ అవుతున్నారు. ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా మీడియా మ్యానేజ్మెంట్ ద్వారానే సక్సెస్ అయ్యారు. అప్పటినుండి చంద్రబాబు కేవలం మీడియాను మాత్రమే నమ్ముకున్నారు.






ఇదంతా దగ్గరనుండి చూసిన తమ్ముళ్ళు కూడా చంద్రబాబునే ఫాలోఅవుతున్నారు. మీడియాను కాకుండా జనాలను నమ్ముకోమని చంద్రబాబు చెబితే తమ్ముళ్ళకు ఎంత ఇబ్బంది. అందుకనే చంద్రబాబు ఎంతచెప్పినా తమ్ముళ్ళు మాత్రం జనాల్లోకి వెళ్ళకుండా కేవలం మీడియా ముందుకు మాత్రమే వస్తున్నారు. దాన్నిపుడు చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో మంత్రులు, ఎంఎల్ఏలంతా జనాల్లో ఉండాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి గట్టిగా చెబుతున్నారు. ఈ నేపధ్యంలో తమ్ముళ్ళ వ్యవహారం ఇలాగే ఉంటే రేపటి ఎన్నికల్లో విజయం సాధించేది ఎలాగన్న టెన్షన్ చంద్రబాబులో పెరిగిపోతోంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: