ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడును పార్టీలో ఇద్దరు సీనియర్ నేతలు ఓ ఆటాడుకుంటున్నారు. విషయం ఏమిటంటే వీళ్ళద్దరు కూడా ఎంపీలే. అవును గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, విజయవాడ ఎంపీ కేశినేనీయే వాళ్ళిద్దరు. వీళ్ళతో సమస్యలు ఏమిటంటే పార్టీ ఎంపీలుగా చెలామణి అవుతునే పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనబడటంలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నిర్వహిస్తున్న ఆందోళణ కార్యక్రమాల్లో  ఎక్కడా కనబడరు.





పోనీ సమీక్షా సమావేశాలకు హాజరవుతున్నారా అంటే అదీలేదు. జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ అవుతున్న సందర్భాల్లో కూడా కనబడటంలేదు. పోనీ పార్టీకి దూరమైపోయారా అంటే లేదనే అంటున్నారు. అంటే పార్టీ ఎంపీలుగా ఉంటున్నారే కానీ పార్టీలో ఎక్కడా కనబడటంలేదు. చంద్రబాబుకే వీళ్ళిద్దరు అందుబాటులో ఉండటంలేదంటే ఇక నేతలు, కార్యకర్తలకు మాత్రం ఏమి అందుబాటులో ఉంటారు. వీళ్ళిద్దరు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పార్టీ తరపున పోటీచేస్తున్నారా అంటే గ్యారెంటీలేదు.






ఎంపీలుగా వీళ్ళకే టికెట్లివ్వాలో వద్దో కూడా చంద్రబాబు తేల్చుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో జయదేవ్ వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా కాకుండా చంద్రగిరి ఎంఎల్ఏగా పోటీచేసే ఆలోచనలో ఉన్నారంటు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఎంతవరకు కరెక్టో కూడా జయదేవ్ చెప్పటంలేదు. అలాగే నాని కూడా వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేయబోతున్నట్లు ప్రచారం మొదలైంది. దీంతో పై రెండు నియోజకవర్గాల్లోని ఆశావహుల్లో గందరగోళం మొదలైంది.






మొన్ననే ఢిల్లీకి వెళ్ళిన చంద్రబాబుకు ఎయిర్ పోర్టులో ఫ్లవర్ బొకే ఇచ్చి రిసీవ్ చేసుకోవటానికి కూడా నాని ఇష్టపడని విషయం అందరు చూసిందే. పార్టీ అధినేతకు బొకే ఇవ్వటానికి నాని ఎందుకు ఇష్టపడలేదో పార్టీ నేతలకే అర్ధం కావటంలేదు. మొత్తానికి ఈ ఇద్దరు ఎంపీలు టీడీపీలోనే ఉన్నారో లేదో కూడా తమ్ముళ్ళకే అర్ధం కావటంలేదు. ఈ విధంగా వీళ్ళు చంద్రబాబులోనే అయోమయం సృష్టిస్తు ఆటాడుకుంటున్న విషయం తెలిసిపోతోంది. అయినా ఏమీ చేయలేని పరిస్ధితి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీది.





మరింత సమాచారం తెలుసుకోండి: