పార్టీ నేతల విస్తృతస్ధాయి సమావేశంలో కేసీయార్ మనసులోని మాటను బయటపెట్టేసినట్లే ఉన్నారు. టీఆర్ఎస్ ను జాతీయపార్టీగా మార్చి ఇకనుండి జాతీయ రాజకీయాల్లో బిజీ అయిపోవాలని కేసీయార్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే పార్టీ నేతల ఆమోదం తీసుకునేందుకు జరిపిన సమావేశంలో కేసీయార్ కీలకమైన పాయింట్లు రెండుచెప్పారు. అవేమిటంటే మొదటిది పార్టీ పేరు మారుతుంది కానీ కారు గుర్తు మాత్రం అలాగే కంటిన్యు అవుతుందట.





ఇక రెండో పాయింట్ ఏమిటంటే జాతీయస్ధాయిలో పోటీ బీజేపీతోనే కానీ ఇతర పార్టీలతో కాదని. అంటే జాతీయస్ధాయిలో సమస్యలు బీజేపీ నుండి మాత్రమే వస్తుందని కేసీయార్ అంచనా వేసుకుంటున్నారు. మరదే నిజమైతే కాంగ్రెస్ పరిస్ధితి ఏమిటి ? అంటే కాంగ్రెస్ ను కేసీయార్ ఏమాత్రం లెక్క తీసుకోవటంలేదని అర్ధమైపోతోంది. ఇదే సమయంలో తమతో కలిసివచ్చే పార్టీలతో మాత్రమే ముందుకెళ్ళాలని డిసైడ్ అయిపోయినట్లున్నారు.





సో కేసీయార్ వరసచూస్తుంటే నాన్ ఎన్డీయే, యూపీఏ పార్టీలను కలుపుకుని వెళ్ళే ఆలోచనలో లేరని అర్ధమైపోతోంది. తనతో కలిసివచ్చే పార్టీలతో అంటే ఇప్పటికప్పుడు కేసీయార్ తో చేతులు కలిపే పార్టీలు పెద్దగా లేవు. బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీహార్ సీఎం నితీష్ కుమార్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ లాంటి వాళ్ళెవరు కేసీయార్ తో చేతులు కలపటానికి సిద్ధంలేరని తెలుస్తోంది.





అందుకనే అవుట్ డేటెడ్ పొలిటీషియన్ శంకర్ సింగ్ వాఘేలా, రైతునేత రాకేష్ తికాయత్ తో పాటు ఎవరికీ తెలీని కొందరు రైతునేతలు మాత్రమే కేసీయార్ తో కలిసే అవకాశముంది. మహాఅయితే కర్నాటకలో దేవేగౌడ కలిపే అవకాశాలున్నాయంతే. కాంగ్రెస్ తో కలవటం వల్ల తనకు ఎదురయ్యే సమస్యల కారణంగానే హస్తం పార్టీతో కలవటానికి రెడీగా ఉన్న పార్టీలను కూడా కలుపుకుని వెళ్ళటానికి కేసీయార్ వెనకాడుతున్నారు. మరి పెద్దపార్టీల్లో ఏదీ కేసీయార్ తో కలవకపోతే ఎలా సక్సెస్ కొడతారో.


మరింత సమాచారం తెలుసుకోండి: