మాట చాల శక్తివంతమైన ఆయుధం. మాటను ఎంత పొదుపుగా వాడితే అంత గట్టిగా సౌండ్ చేస్తుందంటారు పెద్దలు. అసందర్భంగా ఏదో మాట్లాడేసి ఇరుక్కుపోయిన వాళ్ళు చాలామందున్నారు. ఇప్పుడిదంతా ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి కూడా నోరిజారి అనవసరంగా నెటిజన్ల దగ్గర ఇరుక్కుపోయారు కాబట్టే. ఇంతకీ విషయం ఏమిటంటే పాలకొల్లులో  అల్లు స్టూడియో ప్రారంభం అయ్యింది. ఆ సందర్భంగా చిరంజీవి అనవసరంగా రాజకీయాలు మాట్లాడారు.





ఎప్పుడైతే రాజకీయాలు మాట్లాడారో అడ్డంగా బుక్కయిపోయారు. ఇంతకీ మెగాస్టార్ ఏమన్నారంటే  సినిమా రంగంలో ఉంటే నూరుశాతం ఇదే రంగంలో ఉండాలన్నారు. సినిమాల్లో ఉన్నపుడు ఇతర వ్యాపారాలు, వ్యాపకాలు పెట్టుకుంటే కష్టమన్నారు. ఇంతటితో ఊరుకుంటే ఎలాంటి గొడవా ఉండకపోను. దానికి కొనసాగింపుగా ఇన్ని చెబుతున్న తాను సినిమాల్లో ఉంటునే రాజకీయాల్లోకి ఎందుకు ప్రవేశించావని అడుగుతారేమో అని అన్నారు.





సినిమాల్లో ఉంటు రాజకీయాల్లో ట్రై చేశావు కదాని అడుగుతారేమో అని సందేహాన్ని వ్యక్తంచేశారు. జనాలకు లేని సందేహం చిరంజీవికి ఎందుకొచ్చింది ? దీన్నే దారినపోయే చెత్తను నెత్తిన వేసుకోవటం అని అంటారు. పోనీ సినిమాల్లో ఉంటూ రాజకీయాల్లో ఎందుకు ట్రై చేశారో చెప్పాలి కదా. చెప్పకుండా ఏదో మధ్యలో ట్రై చేశాను అదంతా ఇపుడు ఎందుకు వదిలేయండి అని తానే సమాధానం చెప్పుకున్నారు. ఇక్కడే చిరంజీవిపై నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టేశారు.





తనమీద తానే ప్రశ్నవేసుకున్న చిరంజీవి చివరకు తానే సమాధానం చెప్పలేకపోయారంటు ఎగతాళి చేస్తున్నారు. అలాగే ఈ సలహా జనసేన అధినేత, తమ్ముడైన పవన్ కల్యాణ్ ను ఉద్దేశించేనా అంటు మరికొందరు తగులుకున్నారు. తమ్ముడు పవన్ సక్సెస్ పై చిరంజీవిలొ అనుమానాలు మొదలయ్యాయా ? అని కొందరు నెటిజన్లు అడుతున్నారు. ఏదేమైనా అనవసరంగా తనంతట తానుగా కెలుక్కుని నెటిజన్ల దగ్గర చిరంజీవి  ట్రోలింగ్ చేయించుకుంటున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. మామూలుగా అయితే చిరంజీవి విదాదాలకు దూరంగాన ఉంటారు. కానీ ఇపుడేమైందో ఏమో సోషల్ మీడియాలో నెటిజన్లకు పనిచెప్పేట్లుగా దొరికిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: