ఏదైనా తప్పు చేస్తేనే జైలుకు పంపిస్తారు. కొన్ని చిన్న తప్పులు అయితే మందలించి వదిలేస్తారు.. జైలు శిక్ష పడింది అంటే పెద్ద నేరమని అంటారు.అయితే జైలు జీవితం ఒక నరకం..కనీసం కడుపు నిండా అన్నం కూడా పెట్టరు. ఇక వసతుల సంగతి గురించి చెబితే దారుణం అని చెప్పాలి..అలాంటి వాటి గురించి మాట్లాడటానికి చాలా మంది భయపడుతుంటారు.. కానీ ఇప్పుడు చెప్పే మాట వింటే మాత్రం అవాక్కవుతారు..సాధారణంగా జైలులో బతికే ఖైదీలకు చాలా సాధారణమైన భోజనం పెడతారు.


అలాగే తప్పు చేసిన వీరికి బుద్ధి వచ్చే లాగా ఎలాంటి సౌకర్యాలు అందించరు. సింపుల్‌గా చెప్పాలంటే జైలులో బతుకు వీరికి నరకం అవుతుంది..అలాంటి బతుకుల్లో అప్పుడప్పుడు వెలుగులు నింపేందుకు అధికారులు వారికి స్పెషల్ ఫుడ్ పెడుతుంటారు. అయితే తాజాగా దక్షిణ కోల్‌కతాలోని జైలు అధికారులు ఏకంగా 2,500 మంది ఖైదీలకు మటన్ బిర్యానీతో పాటు రకరకాల రుచికరమైన వంటలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ దసరా పండుగ సందర్భంగా ప్రెసిడెన్సీ సెంట్రల్ కరెక్షనల్ హోమ్‌లోని దాదాపు 2,500 మంది ఖైదీలు అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 5 వరకు మాంసాహార పదార్థాలు పెట్టనున్నారు.


మహా అష్టమి రోజు మినహా మూడు రోజులు వారికి స్పెషల్ ఫుడ్ పెడతారు. ఈ ఖైదీలకు శాకాహారమైన ఖిచురి, పోలావ్, లూచీ, దమ్ ఆలూ, పనీర్ మసాలా, కోర్మా వంటివి అందిస్తారు. అక్టోబర్ 3వ తేదీ అష్టమి రోజున కాకుండా మిగతా మూడు రోజులు ఖైదీలు తినడానికి రక రకాల మాంసం అందుబాటులో ఉంటుంది. ఇందులో మటన్ బిర్యానీ, మటన్ కాలియా, వివిధ రకాల చేపలు, రొయ్యల వంటకాలు, ఫ్రైడ్ రైస్, చిల్లీ చికెన్ లాంటివి ఎన్నో ఉంటాయి.ఈ ప్రత్యేక మెనూలో రసగుల్లాలు, లడ్డూల వంటి స్వీట్స్ కూడా ఉంటాయి. ఆ విధంగా ఈ దసరా సందర్భంగా ఖైదీలు కూడా పండగ చేసుకుంటున్నారు. వారు కూడా మనుషులే, వారి పట్ల కూడా ప్రేమ చూపించి వారిని మార్చాలనే ఉద్దేశంతో అధికారులు ఇలా చేస్తున్నారు...మొత్తానికి ఈ ఆఫర్ జనాలకు నచ్చడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: