క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎలాగైనా కింజరాపు అచ్చెన్నాయుడును ఓడించాలని వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ టార్గెట్ గా పెట్టుకున్నారు. దువ్వాడ మొన్నటి ఎన్నికల్లో అచ్చెన్నపై ఓడిపోయినా తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎంఎల్పీని చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినా వచ్చే ఎన్నికల్లో అచ్చెన్నను ఓడించటమే ధ్యేయంగా దువ్వాడ పనిచేస్తున్నారు.





వ్యక్తిత్వాన్ని తీసుకుంటు అచ్చెన్న, దువ్వాడ ఇద్దరూ బాగా దూకుడు మనుషులే కావటంతో తరచూ ఏదో విషయంలో నియోజకవర్గంలో రెండుపార్టీల మధ్య గొడవలు జరుగుతునే ఉంటాయి. ఈ విషయాలన్నింటినీ పక్కనపెట్టేస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీ మూడు రాజధానుల అంశమే కీలకం కానున్నది. అలాగే టీడీపీ అమరావతి డిమాండ్ కీలకపాత్ర పోషించనున్నది. వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా జగన్ ప్రకటించగానే ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో సానుకూలత కనిపించింది.






అయితే మొదట్లో టీడీపీ నేతలకు ఏమాట్లాడలో అర్ధంకాక మౌనంగానే ఉన్నారు. కానీ తర్వాత ఏమైందో ఏమో తమ్ముళ్ళల్లో కొందరు అమరావతి డిమాండ్ నే వినిపిస్తున్నారు. ఇపుడు అచ్చెన్న చేస్తున్నదిదే. వైజాగ్ ను రాజధాని చేస్తానని జగన్ అంటే ఆ ప్రాంతం వాళ్ళెవరూ సహజంగానే అభ్యంతరం చెప్పరు. కానీ అచ్చెన్న మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అనే డిమాండును వినిపిస్తున్నారు. ఇది వచ్చే ఎన్నికల్లో అచ్చెన్నను దెబ్బతీస్తుందా అనే టాక్ పెరిగిపోతోంది.






నిజంగానే వైజాగ్ రాజధాని అవుతుందనే ఆశ జనాల్లో బలంగా ఉంటే అమరావతి డిమాండ్ అచ్చెన్నకు పెద్ద మైనస్ అవటం ఖాయం. ఓడించేందుకు దువ్వాడ పావులు కదపటానికి తోడు జనాల ఆశలు తోడైతే అచ్చెన్న గెలుపు సాధ్యంకాదు. జనాల ఇష్టానికి వ్యతిరేకంగా నడుచుకునే ఏ నాయకుడు కూడా ఎన్నికల్లో గెలవలేడు. టీడీపీ వాయిస్ ను జనాల్లో బలంగా వినిపిస్తున్న నేతల్లో అచ్చెన్న కూడా ఒకళ్ళు. అలాంటిది అచ్చెన్నే వచ్చే ఎన్నికల్లో గెలవలేకపోతే మూడు రాజధానుల అంశానికి జనాలు రాష్ట్రమంతా సానుకూలంగా ఉన్నారనే అనుకోవాలి. అప్పుడు అచ్చెన్నకే కాదు చంద్రబాబునాయుడుకు కూడా ఇబ్బందులు తప్పవు.


మరింత సమాచారం తెలుసుకోండి: