సాధారణంగా దారిలో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు పాము కనిపించిందంటే చాలు ఎంతోమంది భయపడిపోతూ ఉంటారు అని చెప్పాలి. ఒకవేళ అది విషపూరితమైన పాము అయితే వెన్నులో వణుకు పుడుతుంది. ఒకవేళ ఆ పాము మన వైపే వస్తుంది అంటే అక్కడి నుంచి పరుగో పరుగు అంటారు ప్రతి ఒక్కరు   అయితే వర్షాకాలం కావడంతో ఎక్కువగా పాములు అటు జనావాసాల్లోకి రావడం లాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇక కొంతమంది ఇళ్లల్లోకి వచ్చి ఏకంగా కాటు వేయడం లాంటిది కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి.


 ఒకవేళ పాము ఇంట్లోకి వచ్చింది అని తెలిస్తే ప్రతి ఒక్కరూ భయంతో వణికి పోతూ ఉంటారు.  ఎట్టి పరిస్థితుల్లో ఇక ఆ పామును ఇంట్లో నుంచి బయటికి పంపించడం లేదా ప్రాణాలు తీయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కొంతమంది మాత్రం ఏకంగా పాములతో కలిసి జీవిస్తున్నారు. పాములను ఇంట్లోనే పెట్టుకుని వాటి పక్కనే పడుకోవడం తినడం లాంటివి చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఒడిస్సా లోని మల్కాన్ గిరి జిల్లాలో నిలిమిరి గ్రామం ఉంది. ఈ గ్రామంలో నీలకంఠ భూమియ కుటుంబ సభ్యులు నాగుపాములతోనే ఓకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఏమాత్రం భయం లేకుండా రోజువారి కార్యకలాపాలు యధావిధిగా కొనసాగిస్తున్నారు.


 ఇక్కడ విచిత్రం ఏమిటంటే సాధారణంగా నాగుపాములు మనుషులను చూస్తే చాలు అపాయం ఉంటుందేమో అని కాటు వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. కానీ ఎన్నో ఏళ్ల నుంచి పాములతో కలిసి ఈ కుటుంబం ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా ఆ పాములు వీరికి హాని చేయలేదట. వీరి ఇంట్లో మొత్తం ఐదు గదులు ఉండగా వాటిలోని రెండు గదుల్లో పెద్దపెద్ద పూటలు ఉంటాయి పుట్టలకు పుట్టలు ఉన్నాయి. అయితే వీరి కుటుంబ సభ్యులు వారంలో రెండు సార్లు పూజలు నిర్వహించి పాలు పోస్తూ ఉంటారు. ఇక ఈ విషయం తెలిసి స్థానికులు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: