తెలంగాణా తమ్ముళ్ళు చంద్రబాబునాయుడుపై ఒత్తిడి బాగా పెంచేస్తున్నారు. మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో టీడీపీ పోటీచేయాలా ? వద్దా ? అన్నది ఇపుడు పెద్ద సమస్యగా మారిపోయింది. టీడీపీని పోటీలోకి దించే విషయంలో చంద్రబాబు వెనకాడుతున్నారు. ఒకవేళ టీడీపీ గనుక పోటీలోకి దించితే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పై ఆరోపణలు, విమర్శలు చేయాల్సుంటుంది. ఎందుకంటే టీడీపీకి పై మూడుపార్టీలు ప్రతిపక్షపార్టీలే కాబట్టి.





కాంగ్రెస్ పై ఆరోపణలు, విమర్శలు చేయటం వరకు ఓకేనే కానీ బీజేపీ, టీఆర్ఎస్ పై ఆరోపణలు, విమర్శలంటే చంద్రబాబుకు చెమటలు పట్టడం ఖాయం. పొరబాటున కాదుకదా చివరకు కలలో కూడా బీజేపీ, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడాలంటే చంద్రబాబు భయపడుతున్నారు. ఇలాంటి నేపధ్యంలోనే ఉపఎన్నికలో టీడీపీ పోటీచేసినా ఎవరిని టార్గెట్ గా చేసుకుంటుంది ? ఎవరినీ టార్గెట్ చేయకుండా, ప్రతపక్షాలను టార్గెట్ చేయకుండా ఎన్నికల్లో టీడీపీ ఏమని ప్రచారం చేస్తుంది ?





టీడీపీని పోటీచేయించటంలో చంద్రబాబుకు ఇదే అతిపెద్ద సమస్య. ఇదే సమయంలో తమ్ముళ్ళు మాత్రం పోటీలోకి దిగాల్సిందే అని పట్టుబడుతున్నారు. ఇదే విషయమై శనివారం జరిగిన సమీక్షా సమావేశంలో తమ్ముళ్ళంతా మునుగోడు ఉపఎన్నికలో పోటీచేయాల్సిందే అని పట్టుబడుతున్నారు. ఒకవైపు మునుగోడులో సభ్యత్వ నమోదు చేస్తున్నారు. సీమాంధ్ర ఓట్లు కూడా చాలనే ఉన్నాయి. బీసీల ఓట్లు కూడా చాలా ఉన్నాయి. నియోజకవర్గం మొత్తం ఓట్లలో 60 శాతం బీసీలే ఉన్నారు.





ఇక్కడ గమనించాల్సిందేమంటే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుండి అభ్యర్ధులు రెడ్డి సామాజికవర్గం వాళ్ళే. కాబట్టి టీడీపీ తరపున బీసీ అభ్యర్దిని రంగంలోకి దింపితే బాగుంటుందని కూడా తమ్ముళ్ళు చంద్రబాబుకు గట్టిగా చెబుతున్నారు. చంద్రబాబు ఒకరకంగా ఆలోచిస్తుంటే తమ్ముళ్ళంతా మరోరకంగా ఆలోచిస్తున్నారు. దాంతో తమ్ముళ్ళకి ఎలా చెప్పాలో అర్ధంకాక చంద్రబాబు నానా అవస్తలు పడుతున్నారు. నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది కాబట్టి ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని తమ్ముళ్ళు చంద్రబాబుకు గట్టిగా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: