మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో ఓట్ల వేలంపాట మొదలైనట్లే ఉంది. ఓటుకు బీజేపీ ఇంత ఇవ్వటానికి రెడీ అవుతోందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో ఓటును ఇంత ధర పెట్టి కొనటానికి బీజేపీ బేరం ఫిక్స్ చేసుకుందని  టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ రెండు పార్టీల వ్యవహారం చూసిన తర్వాత ఎంతోకొంత డబ్బు ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ కూడా రెడీ అవ్వాల్సిందే కదా. అంటే మూడుపార్టీలు కూడా ప్రతి ఓటరకు ఎంతోకొంత డబ్బు చెల్లించక తప్పదు.





ఇపుడే ఓటుకు ఇంత ధర పలుకుతుంటే ఇక పోలింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకెంత పలుకుతుందో ?  ఇక్కడ విషయం ఏమిటంటే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతు టీఆర్ఎస్ నేతలు ఓటుకు రు. 40 వేలు ఇవ్వటానికి రెడీ అవుతున్నారంటు ఆరోపించారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి మాట్లాడుతు బీజేపీ ఓటుకు రు. 30 వేలకు బేరం కుదుర్చుకుంటున్నట్లు మండిపడ్డారు. అంటే స్ధూలంగా టీఆర్ఎస్ ఓటుకు రు. 40 వేలు, బీజేపీ రు. 30 వేలు ఇవ్వబోతున్నాయని అర్ధమవుతోంది.






మరి ఈ రెండుపార్టీలు ఇంత ధర చెల్లిస్తుంటే కాంగ్రెస్ చూస్తు ఊరుకోదుకదా. పై రెండుపార్టీలు చెల్లించినంత కాకపోయినా ఎంతోకొంత తక్కువలో తక్కువ రు. 10 వేలైనా ఇవ్వక తప్పదు కదా. పైగా ఓటుకు టీఆర్ఎస్, బీజేపీలు ఎంత డబ్బులు ఇస్తాయనే విషయం హుజూరాబాద్ ఉపఎన్నికలో అందరు చూశారు.





అంటే మునుగోడు ఉపఎన్నికలో నాలుగు ఓట్లున్న ఇంటికి అన్నీ పార్టీల నుండి కలిసి సుమారు రు. 3.20 లక్షలు అందుతుందన్నమాట. ప్రతి ఓటరుకు ప్రతిపార్టీ డబ్బులు ఇవ్వటానికి రెడీ అయిపోతున్నాయి. అందరు డబ్బులు తీసుకునే ఓట్లేస్తారని అనుకునేందుకు లేదు. కాకపోతే అభ్యర్ధులు ఇస్తుంటే తీసుకోవటానికి ఏమిటనే పాయింట్ జనాల్లోకి వెళిపోతోంది. 





హుజూరాబాద్ ఉపఎన్నికలో జరిగిందిదే. పార్టీ తరపున డబ్బులు ఇవ్వటానికి వచ్చినపుడు తీసుకోవటానికి నిరాకరించిన ఇంట్లోని వాళ్ళని ప్రత్యర్ధి పార్టీకి ఓట్లేస్తారనే ముద్రవేశారు.  దాంతో చాలామంది ఎందుకొచ్చిన గోలని పార్టీల వాళ్ళు  ఇచ్చింది తీసుకుని నచ్చిన వాళ్ళకి ఓట్లేశారు. సో ఇపుడు మునుగోడులో మొదలైన వ్యవహారం చూస్తుంటే ఓట్ల వేలంపాట మొదలైనట్లే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: