ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నపుడు టీడీపీ ఏ విధంగా ఉందో తెలిసిందే. ముఖ్యంగా రాష్ట్రము విడిపోయిన తర్వాత కేవలం టీడీపీ ఒక్క ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే పరిమితం అయింది. కానీ రేవంత్ రెడ్డి అయినా పార్టీ మూలలను కాపాడుతాడని భావిస్తే... అతను కూడా కాంగ్రెస్ లోకి జంప్ అవ్వడంతో టీడీపీ జీరో అయిపోయింది. అప్పటి నుండి చంద్రబాబు సైతం అక్కడ పెద్దగా ఇంటరెస్ట్ చూపించడం లేదు. కానీ తాజాగా తెలంగాణలోని నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మరియు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళిపోయాడు. దీనితో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది.

రీసెంటుగా ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల అయింది. దీనితో అన్ని రాజకీయ పార్టీలు సెట్ రైట్ అవుతున్నాయి. కాగా నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ కూడా తమ తరపున అభ్యర్థిని పోటీకి దింపుతారు అన్న వార్త బయటకు వచ్చింది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ ఉప ఎన్నికకు టీడీపీ దూరంగా ఉంటుందని టీటీడీపీ అధ్యక్షుడు నర్సింహులు తెలిపారు. అయితే దీని వెనుక చంద్రన్న మాస్టర్ ప్లాన్ ఉందని రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణాలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటి నుండే కసరత్తులు చేస్తున్నారట. అంతే కాకుండా తెరాస ను గద్దె దించడానికి బీజేపీ తో కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలన్నది ప్లాన్ గా తెలుస్తోంది. అయితే ఏపీలో పరిస్థితి వేరుగా ఉంది, టీడీపీ కి బీజేపీ కి మధ్యన అంత సఖ్యత లేదు. అలాంటిది తెలంగాణాలో ఇలా జరుగుతుందా అన్న అనుమానాలు కొందరిలో ఉన్నాయి. అయితే ముందుగా ఏపీలో ప్రస్తుతం ఉన్న సమస్యలన్నీ తీర్చుకుని ఎన్నికల్లో గెలవాలని ఆశిస్తున్నారు. మరి దీనిపై ఒక స్పష్టత రావాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే. మరి దీనిపై ఒక స్పష్టత రావాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: