నరసాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎక్కడో ఢిల్లీలో కూర్చుని జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వంగురించి నోటికొచ్చింది మాట్లాడేస్తుంటారు. ఆ మాట్లాడేదో నేరుగా నియోజకవర్గానికి వచ్చి మాట్లాడమంటే మాత్రం అడ్రస్సుండరు. ఇపుడిదంతా ఎందుకంటే ఈనెల 28వ తేదీన నరసాపురం నియోజకవర్గంలో జగన్ పర్యటించబోతున్నారు. కొన్ని ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనల్లో పాల్గొనబోతున్నారు.





ఇదే కార్యక్రమంలో కేంద్రమంత్రి మురుగన్ కూడా పాల్గొనే అవకాశముంది. నియోజకవర్గం ఆక్వా ఉత్పత్తులకు పెద్ద హబ్ గా మారిన విషయం తెలిసిందే. సో కార్యక్రమం ఎలాగూ ఆక్వా సంబంధితమైనదే కాబట్టి కేంద్రమంత్రి కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి. విచిత్రం ఏమిటంటే తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమానికి హాజరవ్వాలని ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి ఎంపీ ఆహ్వానించటం. కేంద్రమంత్రిని ప్రభుత్వం ఎలాగూ ఆహ్వానిస్తుంది కదా మధ్యలో ఎంపీ ఆహ్వానం ఎందుకు ?




పోనీ కేంద్రమంత్రిని వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించాలని ఎంపీ అనుకున్నారు బాగానే ఉంది. మరి తాను హాజరవుతారా ? ఏపీలోకి వచ్చేంత ధైర్యం చేస్తారా ? అన్నదే ఇక్కడ పాయింట్. జగన్ పైనే కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో కూర్చుని  ప్రతిరోజు టైంటేబుల్ వేసుకుని మరీ దుమ్మెత్తిపోస్తున్నారు. వ్యక్తిగతంగా జగన్ను టార్గెట్ చేయకపోయుంటే ఇపుడు ఎంపీ పరిస్ధితి ఇంత దయనీయంగా ఉండేదికాదేమో. ఎందుకంటే ప్రభుత్వాన్ని విమర్శించినంత కాలం వైసీపీ నేతలెవరు ఎంపీ జోలికి వెళ్ళలేదు. జగన్ పై నోటికొచ్చింది మాట్లాడిన తర్వాతే ఎంపీకి సీఐడి దగ్గర సన్మానం జరిగింది. 





ఎప్పుడైతే జగన్ను వ్యక్తిగతంగా ఎంపీ టార్గెట్ చేశారో అప్పటినుండే కష్టాలు మొదలయ్యాయి. ఈ కారణంగానే ఈమధ్యనే జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా హాజరుకాలేకపోయారు. నియోజకవర్గంలోకి అడుగుపెట్టేంత ధైర్యంలేని వ్యక్తి జగన్ పై వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలు ఎందుకు చేయాలి ? మరి 28వ తేదీన కేంద్రమంత్రి కార్యక్రమానికైనా ఎంపీ హాజరయ్యే ధైర్యం చేస్తారా ? చూడాల్సిందే ఏం చేస్తారో ?  



మరింత సమాచారం తెలుసుకోండి: