తెలుగుదేశంపార్టీ రెబల్ ఎంఎల్ఏ వల్లభనేని వంశీ  పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గాలి తీసేశారు. ఇమధ్యనే బావమరిది కమ్ వియ్యంకుడు నందమూరి బాలకృష్ణతో ఒక చాట్ షోలో చంద్రబాబు పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ ఇంటర్వ్యూలో ప్రధానమైన పాయింట్ ఏమిటంటే 1995లో బావమరుదులు, తోడల్లుళ్ళతో కలిసి చంద్రబాబు పార్టీ వ్యవస్ధాపకుడైన ఎన్టీయార్ కు వెన్నుపోటు ఘటనే. జనాలందరిలో ఎన్టీయార్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనే అభిప్రాయం జనాల్లో బాగా స్ధిరపడిపోయింది. 





అయితే చంద్రబాబు మాత్రం దాన్ని 1995 సంక్షోభం అని సమర్ధించుకుంటున్నారు. చాట్ షో లో ఆ విషయమే హౌలైట్ గా నిలిచింది. పార్టీని రక్షించుకోవటం కోసమే ఆరోజుల్లో అంతటి కఠినమైన నిర్ణయాన్ని మనం అందరం కలిసి తీసుకోవాల్సొచ్చిందని బాలయ్యను కలుపుకుని జనాలకు చంద్రబాబు వివరణిచ్చుకున్నారు. ఇదే విషయాన్ని వంశీ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. బాలకృష్ణ, హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వర్రావు, దగ్గుబాటి పురందేశ్వరితో కలిసి చంద్రబాబు ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచింది వాస్తవమన్నారు.





పార్టీని రక్షించుకునేందుకే వీళ్ళందరితో కలిసి ఆరోజు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సొచ్చిందని చెప్పేదంతా ఉత్త సొల్లుగా వంశీ కొట్టిపడేశారు. చంద్రబాబు చెప్పిందే నిజమైతే మరి ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచిన నెలరోజులకే వెంకటేశ్వరరావు తిరిగి ఎన్టీయార్ దగ్గరకు ఎందుకు వచ్చేశారని ప్రశ్నించారు. హరికృష్ణ టీడీపీలో నుండి వచ్చేసి వేరేపార్టీ ఎందుకు పెట్టుకున్నారంటు అడిగారు. దగ్గుబాటి పురందేశ్వరి ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారో చెప్పాలన్నారు.





ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచిన ఘటనలో  ఐదుగురిలో దగ్గుబాటి దంపుతులు, హరికృష్ణ  ఎందుకు విభేదించారో చెప్పాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. ముగ్గురు విడిపోవటంతోనే చంద్రబాబు చెప్పిన కారణం తప్పని జనాలందరికీ అర్ధమవుతోందన్నారు. ఇక ఇంటర్వ్యూ విషయాన్ని ప్రస్తావిస్తు అడగాల్సిన ప్రశ్నలు, చెప్పాల్సిన ప్రశ్నలను బాలయ్య, బావయ్య బట్టీ పెట్టుకుని వచ్చి స్టూడియోలో కూర్చున్నట్లుందని వంశీ ఎద్దేవాచేశారు. ప్రశ్నలు అడిగే ఆయన ఎందుకు అడిగారో చెప్పినాయన ఎందుకు చెప్పారో అందరికీ అర్ధమవుతోందన్నారు. బిల్ గేట్స్ ను, బిల్ క్లింటన్ను హైదరాబాద్ కు రప్పించానని డప్పుకొట్టుకునే చంద్రబాబు వెన్నుపోటు ఘటనపై వివరణ ఇచ్చుకునేందుకు స్టూడియోకి వెళ్ళటం ఏమిటంటు ఎద్దేవా చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: