మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీచేస్తున్న అభ్యర్ధులకు కేటాయించే గుర్తుల విషయంలో టీఆర్ఎస్ వాదనను హైకోర్టు కొట్టేసింది. బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారును పోలి ఉన్న ఇతర గుర్తులను ఎన్నికల సంఘం ఎవరికీ ఇవ్వకూడదంటు కేసీయార్ అభ్యంతరాలు వ్యక్తంచేశారు. అయితే ఇండిపెండెంట్లుగా పోటీచేస్తున్న కొందరికి ఎన్నికల సంఘం కొన్ని గుర్తులను కేటాయించింది. దాంతో ఎన్నికల సంఘం నిర్ణయాన్ని చాలెంజ్ చేస్తు బీఆర్ఎస్ నేతలు కోర్టులో కేసువేశారు. ఆ కేసును హైకోర్టు కొట్టేసింది.





బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారన్న విషయం తెలిసిందే. అయితే కారును పోలినట్లుగా ఉంటే ట్రాక్టర్, ఆటో, రోడ్డురోలర్, రోటీమేకర్ లాంటి ఎనిమిది గుర్తులను ఎవరికీ కేటాయించకూడదన్నది కేసీయార్ డిమాండ్. అయితే కేసీయార్ వేయించిన కేసును కోర్టు కొట్టేయటంతో పార్టీనేతలు ఏమి చేయాలో అర్ధంకాక దిక్కులు చూస్తున్నారు. ఇక్కడ సమస్య ఏమిటంటే కారుగుర్తుకు ఓట్లేయబోయి గ్రామీణ ప్రాంతాల్లోని చాలామంది ట్రాక్టర్, ఆటో, రోడ్డురోలర్, రోటీమేకర్ లాంటి గుర్తులకు ఓట్లేసినట్లు పోయిన ఎన్నికల్లో బయటపడింది.





పై గుర్తులతో  పోటీచేసిన ఇండిపెండెంట్ అభ్యర్ధులకు వచ్చిన ఓట్లకన్నా టీఆర్ఎస్ అభ్యర్ధులు ఓడిపోయిన ఓట్ల తేడా ఎక్కువగా ఉంది. అంటే పై గుర్తులు లేకపోయుంటే ఆ ఓట్లన్నీ కచ్చితంగా టీఆర్ఎస్ కే పడేవనేది కారుపార్టీ నేతల వాదన. సుమారు 13 నియోజకవర్గాల్లో పై గుర్తులకు పడిన ఓట్లకారణంగా టీఆర్ఎస్ ఓడిపోయిందట.





ఇక్కడే బీఆర్ఎస్ నేతల వాదనలోని డొల్లతనం బయటపడింది. తమపార్టీ గుర్తును జనాల్లోకి ఇంకేట్లుగా చూసుకోవాల్సిన బాధ్యత కారుపార్టీ నేతలకే ఉంటుంది. అంతేకానీ దశాబ్దాలుగా వస్తున్న పై గుర్తులను తీసేయమని, లేదా ఎవరికీ కేటాయించద్దని చెప్పే అధికారం కారుపార్టీ నేతలకు లేదు. ఆ విషయం తెలుసుకోకుండా ముందు ఎన్నికల కమీషన్ దగ్గర అభ్యంతరాలు చెప్పటం తర్వాత కోర్టుకెక్కటం విచిత్రంగానే ఉంది. తమపార్టీ గుర్తు జనాల్లోకి వెళ్ళలేదంటే అది పార్టీ నేతలు వైఫల్యంమనే చెప్పాలి. మరి హైకోర్టు తాజా తీర్పుతో గుర్తుల గందరగోళం తమను ఎక్కడ దెబ్బతీస్తుందో అనే టెన్షన్ పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: