తమ్ముడు, బీజేపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గెలుపుకు సీనియర్ కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి  ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని అందరు ముందునుండే అనుమానిస్తున్నారు. ఎంపీ మనసంతా తమ్ముడితో పాటు బీజేపీలోనే ఉంది. కాకపోతే దూరం ఆలోచించి తొందరపడకుండా ముందుగా తమ్ముడిని మాత్రం బీజేపీలోకి పంపారు. కాంగ్రెస్ ఎంఎల్ఏగా ఉన్న రాజగోపాలరెడ్డి రాజీనామా చేయటంతో మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే.





పార్టీ ధర్మం పాటించి కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి గెలుపుకు కృషి చేయలేకపోతున్నారు. అలాగే బీజేపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న తమ్ముడి గెలుపుకోసం బహిరంగంగా పనిచేయలేకపోతున్నారు. అందుకనే మొదట్లో కొందరు మద్దతుదారులను పిలిపించుకుని తమ్ముడి గెలుపుకు పనిచేయాలని ఒత్తిడిపెట్టారు. అప్పట్ల అది బూమరాంగ్ అయ్యింది. రాజగోపాలరెడ్డి గెలుపుకు పనిచేయాలని వెంకటరెడ్డి ఒత్తిడి చేస్తున్నట్లు కొందరు మీడియాతోనే చెప్పేశారు.





తన ప్రయత్నాలు బయటపడటంతో ఖంగుతిన్న ఎంపి కొద్దిరోజులు కామ్ గా ఉండి మళ్ళీ ఇపుడు మొదలుపెట్టారు. ఫోన్లలో మద్దతుదారులతో మాట్లాడుతు తన తమ్ముడి గెలుపుకు పనిచేయాలని చెబుతున్నారు. తాను తొందరలోనే పీసీసీ ప్రెసిడెంట్ అవుతానని, కాంగ్రెస్ గెలుపు ఖామని అపుడు అన్నీ విషయాలు చూసుకుందామని చెబుతున్నారు. పార్టీలు చూడకుండా ముందైతే తన తమ్ముడు రాజగోపాల్ గెలుపుకు పనిచేయాలని అడుగుతున్నారు. మరి ఎంపీ ప్రయత్నాలు ఎంతవరకు వర్కవుటవుతుందో తెలీటంలేదు. 





రాజగోపాలరెడ్డి గెలుపుకోసమే అన్న వెంకటరెడ్డి పనిచేయటం ఖాయమని మొదటినుండి అందరు అనుమానిస్తున్నారు. ఎందుకంటే బ్లడ్ ఈజ్ ధిక్కర్ దేన్ వాటర్ అనే సామెతలాగ సొంతతమ్ముడి ఓడిపోవాలని ఎవరు కోరుకోరు కదా. కాకపోతే తమ్ముడి గెలుపుకోసం కాంగ్రెస్ లో ఉంటు బహిరంగంగా ఎలా పనిచేయాలన్నదే అన్న వెంకటరెడ్డి సమస్య.  బహుశా తమ్ముడు గెలుపుకోసమేనేమో పట్టుబట్టి మరీ పాల్వాయి స్రవంతికి టికెట్ ఇప్పించుకున్నారు. మునుగోడులో ఉండలేక వెంకటరెడ్డి ఆస్ట్రేలియాకు వెళ్ళారనేది టాక్. మరక్కడ నుండి ఫోన్లో ఇంకెతమందితో మాట్లాడుతారో, ఏమేమి ప్రయత్నాలు చేస్తారో చూడాల్సిందే.




మరింత సమాచారం తెలుసుకోండి: