ఏ ముహూర్తంలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బీజేపీ అభ్యర్ధిగా పోటీచేయాలని అనుకున్నారో అప్పటినుండి అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. సీనియర్ నేతల్లో చాలామంది కలిసిరావటంలేదు. మునుగోడు నియోజకవర్గంలోని బీజేపీనేతల్లో చాలామంది పెద్దగా సహకరించటంలేదు. ప్రచారానికి వెళుతుంటే గ్రామస్తులు ఎదురుతిరుగుతున్నారు. తాను కాంగ్రెస్ లో నుండి బీజేపీలో చేరితే తనతో పాటు మద్దతుదారులంతా వచ్చేస్తారని అనుకున్నారు. అయితే చాలామంది బీజేపీలో చేరలేదు.





ఇదే సమయంలో తన మద్దతుదారుల్లో కొందరు టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇదంతా సరిపోదన్నట్లుగా రాజగోపాల్ కే ఓట్లేయాలని బీజేపీ నేతలు ప్రచారం చేస్తుంటే చాలామంది ఓటర్లు రాజగోపాల్ మాకెందుకు తెలీదు కాంగ్రెస్ నేతేగా అంటున్నారు. ఇపుడు ఫైనల్ గా జరిగిన ఇన్సిడెంట్ ఏమిటంటే ప్రచారంలో ఒకచోట రాజగోపాల్ మాట్లాడుతుంటే జనాలు అడ్డుకున్నారు. దాంతో కోపమొచ్చిన రాజగోపాల్ జనాలను ఉద్దేశించి కుక్కలంటు సంబోధించారు. దాంతో ఎవరికో ఒళ్ళుమండి రాజగోపాల్ నిలబడున్న ఓపెన్ టాప్ జీపుమీదకు ఎక్కి చెప్పుతో కొట్టారు.





రాజగోపాల్ చివరి నిముషంలో గమనించటంతో పెద్ద దెబ్బ తగలకుండానే తప్పించుకున్నారు. ఇది గమనించిన మద్దతుదారులు వెంటనే ఆ వ్యక్తిని జీపు పైనుండి కిందకు దింపేశారు. ఈ వీడియో ఇప్పుడు నియోజకవర్గంలో పెద్ద వైరల్ గా మారింది. దీంతోనే రాజగోపాల్ పరిస్ధితి ఏమిటో జనాలందరికీ అర్ధమైపోతోంది. చాలామంది జనాలు రాజగోపాల్ కాంగ్రెస్ ఎంఎల్ఏగా అనవసరంగా రాజీనామా చేసి చెత్త నెత్తినేసుకున్నాడని అనుకుంటున్నారు.





కేవలం తన రు. 18 వేల కోట్ల బొగ్గు కాంట్రాక్టు కోసమే కాంగ్రెస్ ఎంఎల్ఏ పదవికి రాజగోపాల్ రాజీనామా చేశాడనే ముద్ర నియోజకవర్గంమొత్తంలో బలంగా పడిపోయింది. ఈ ముద్ర సరిపోదన్నట్లుగా అన్న, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెన్నుపోటు వ్యవహారం కూడా చర్చ జరుగుతోంది. దీంతో ఏమిచేయాలో అర్ధంకాక అన్న కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్ళిపోయారు. అభ్యర్ధి కాబట్టి రాజగోపాల్ ఎటూ వెళ్ళలేక నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటు జనాలతో చెప్పుదెబ్బలు తింటున్నారు. మొత్తంమీద తాజా ఘటన మాత్రం రాజగోపాల్ కు బాగా డ్యామేజవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: