కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదవికి మరియు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లడంతో మునుగోడు లో ఉప ఎన్నిక ఖరారు అయింది. అప్పటి నుండి మునుగోడే ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలలో ట్రెండింగ్ లో ఉంది. చాలా కాలం గడుస్తున్నా ఉప ఎన్నిక షెడ్యూల్ ఇవ్వకపోవడంతో ఒకింత ఆందోళనకు గురయ్యారు నేతలు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం నుండి వచ్చిన నివేదిక ప్రకారం తెలంగాణ ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దాని ప్రకారం ఈ ఎన్నికలు నవంబర్ 3 వ తేదీన జరుగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ లు పూర్తయిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం తెరాస, కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం మరియి ఇతర స్థానిక పార్టీలు అన్నీ ప్రచారంలో ఉన్నాయి. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం తెరాస మరియు బీజేపీ లతో పోలిస్తే కాంగ్రెస్ ప్రచారంలో కాస్త వెనుకబడినట్లు ఉందట. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వయి స్రవంతి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈమె ఇక్కడ పోటీ చేయడానికి ప్రధాన కారణం.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోటిరెడ్డి వెంకట రెడ్డి కానీ అతనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేస్తుండడం ఈమెను బాగా వేధిస్తోందట. ఆనాడు అందరూ అండగా ఉంటాము ఉన్నాము అన్న భరోసా ఇవ్వడంతోనే పాల్వాయి స్రవంతి అడుగు ముందుకేసి ఎన్నికలకు అవసరం అయిన కొంత డబ్బును ఏర్పాటు చేసుకుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నేతలు చాలా వరకు ప్రచారంలో భాగం కాకపోవడం తో తనలో భయం మొదలైంది.

మునుగోడు నియోజకవర్గంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క మరియు reddy NALAMADA' target='_blank' title='ఉత్తమ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉత్తమ్ కుమార్ రెడ్డి మినహా ఎవ్వరూ చురుకుగా ప్రచారంలో పాల్గొనడం లేదు. కేవలం నామినేషన్ వేసే రోజు మాత్రమే కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నాయకులు అంతా కలిసి వచ్చారు. కానీ ప్రచారంలో మాత్రం స్రవంతికి ఎవ్వరూ మద్దతుగా ఉండకపోవడం ఖచ్చితంగా కాంగ్రెస్ విజయాన్ని దెబ్బ తీస్తుంది. ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ కు ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి ఉన్నట్లు కనిపించడం లేదు. ఎన్నికకు కేవలం 8 రోజులు మాత్రమే ఉండడంతో ఇప్పటికైనా అందరూ ఏకధాటిపై వచ్చి కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి విజయానికి కృషి చెయ్యాలని కోరుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి: