ఒక రాష్ట్రానికి ప్రతినిధిగా ఉన్న రాజకీయ  నాయకుడు ఏ విధంగా ఉండాలి అన్నది ఇంతకు ముందు చాలా మంది నాయకులు చేసి చూపించారు. అయితే కొందరు వారిని ఆదర్శంగా తీసుకుని మంచి పాలనా చేశారు, మరి కొందరు తమసొంత స్టైల్ లో పాలన చేసి ఆకట్టుకున్నారు. అయితే ఇపుడు ఒక సీఎం గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే సదరు సీఎం ఏమి చేశారు ఎందుకు అంతగా అతనిపై చర్చ జరుగుతోంది అన్న విషయానికి వస్తే, చత్తీశ్గడ్ లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ పార్టీ తరపున భూపేష్ భఘేల్ సీఎం గా ఆ రాష్ట్ర ప్రజల బాధ్యతను తీసుకున్నాడు. పాలనలో ఏమైనా తప్పులు చేస్తే సంబంధిత అధికారులు మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి.. తానే కొరడా దెబ్బల రూపంలో శిక్ష వేసుకున్నాడు.

అదేంటి ఈ సీఎం ఏమి తప్పుకి చేశాడు అనుకుంటున్నారా ? కానీ ఇది ఆయన తప్పు చేసిన దానికో కాదు.. తన ఇష్టపూర్వకంగానే అయిదు కొరడా దెబ్బలు తిన్నాడని తెలుస్తోంది. ఈ ఘటన దుర్గ్ జిల్లాలో జజంగిరి కుమహరి అనే గ్రామాలల్లో జరిగింది. అక్కడ స్థానికంగా జరుగుతున్న గౌరీ పూజలో భాగంగా అక్కడకు విచ్చేసిన సీఎం భూపేష్ అక్కడ వారు సంప్రదాయంగా భావిస్తున్న అంశాన్ని తాను కూడా పాటించడం వారి గౌరవానికి విలువ ఇచ్చినట్లయింది. ఈ విధంగా గౌరీ పూజ చేసే సమయంలో మణికట్టుపై అయిదు కొరడా దెబ్బలు తింటే మంచి జరుగుతుందని వారి నమ్మకం. ఈ వీడియో ఇప్పుడు ఎక్కడ బట్టినా వైరల్ గా మారింది.

ఈ వీడియోను చూసిన ప్రజలు అంతా ఏకంగా ఒక రాష్ట్రాధినేత ఇలా స్థానిక ప్రజల నమ్మకాన్ని సీరియస్ గా తీసుకుని తాను కూడా అలా చేయడం అన్నది నిజంగా అభినందనీయం అని చెప్పాలి. తన ప్రజలను గౌరవించువాడు ఎప్పుడూ గొప్ప నాయకుడిగా కీర్తించబడుతాడు. అలా ఒక్క ఘటనతోనే కాంగ్రెస్ నాయకుడు మరియు చత్తీస్గహాడ్ సీఎం భూపేష్ పేరు తెచ్చుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: