జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరి అంతుపట్టడంలేదు. బీజేపీతో కలిసుండాలని లేదు. తప్పనిపరిస్ధితుల్లో ఇంతకాలం ఏదోలా నెట్టుకొచ్చారు.  వైజాగ్ ఎయిర్ పోర్టు గొడవ నేపధ్యంలో అవకాశం దొరికిందికదాని మిత్రపక్షంపై తన అసంతృప్తినంతా కక్కేశారు. తన నిర్ణయం తాను తీసేసుకుంటానని ప్రకటించేశారు. తర్వాత కొద్దిసేపటికే చంద్రబాబునాయుడుతో చేతులు కలిపేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతు టీడీపీ, జనసేనలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతాయని చెప్పేశారు.





ఇంతవరకు పవన్ చెప్పిందిబాగానే ఉంది. బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చంద్రబాబుతో చేతులు కలిపినపుడే పవన్ భవిష్యత్ ఆలోచనలు అందరికీ అర్ధమైపోయాయి. ఒక్కశాతం కూడా ఓటుబ్యాంకు లేని బీజేపీని మోయటం పవన్ కు ఏమాత్రం ఇష్టంలేదని అందరికీ తెలుసు. అందుకే ఎప్పుడెప్పుడు వదిలించుకుందామాని ఎదురుచూస్తున్నారు. ఆ అవకాశం వచ్చినపుడు ఉపయోగించుకోవచ్చుకదా. కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయటంకోసమే చంద్రబాబుతో చేతులు కలిపినట్లు చెప్పుకున్నారు.





ఇదే సమయంలో బీజేపీతో మిత్రత్వం వదులుకుంటున్నట్లు పవన్ ఇప్పటివరకు ఎందుకని ప్రకటించలేదు ? వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపెట్టుకునే ఆలోచనతోనే ఇపుడు చేతులు కలిపారన్న విషయం అందరికీ అర్ధమవుతోంది. ఒకవైపు బీజేపీ నేతలేమో జనసేన, బీజేపీలే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాయంటు పదే పదే ప్రకటనలిస్తున్నారు. కమలనాదుల ప్రకటనలను ఖండించటంలేదు ఇదేసమయంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీతోనే కలిసి పోటీచేస్తానని కూడా చెప్పటంలేదు. ఏ విషయమూ చెప్పకుండా ఎంతకాలం విషయాన్ని నాన్చుదామని పవన్ అనుకుంటున్నారో అర్ధం కావటంలేదు.





పొత్తు లేదు విడిపోతున్నట్లు ఇప్పుడే ప్రకటిస్తే బీజేపీ నుండి ఏదన్నా సమస్యలు మొదలవుతాయని పవన్ భయపడుతున్నారా ? ఎందుకంటే తమను కాదని విడిపోయిన భాగస్వామ్యపార్టీల విషయంలో బీజేపీ ఎలా వ్యవహరిస్తోందో అందరు చూస్తున్నదే. తనకు కూడా అలాంటివే ఏమైనా ఇబ్బందులు ఎదురుకావచ్చని పవన్ అనుమానిస్తున్నారా ? అన్నదే తెలియటంలేదు. లేకపోతే ఒకవైపు చంద్రబాబు భేటీ అయిన తర్వాత కూడా బీజేపీతో కటీఫ్ చెప్పలేదంటేనే పవన్ ఏదో విషయంలో భయపడుతున్నట్లే ఉంది. అదేమిటో తొందరలోనే బయపడుతుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: