గత రెండు నెలలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ నాయకులు మరియు మీడియా అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నిక గురించి అంతా చర్చించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో ప్రధానంగా కాంగ్రెస్, అధికార పార్టీ తెరాస మరియు బీజేపీ లు ప్రధాన పోటీ దారులు అని చెప్పవచ్చు. ఇవి కాకుండా సిపిఐ, ఇతర స్థానిక పార్టీలు మరియు ఇండిపెండెంట్ లతో కలుపుకుని డెబ్బయికిపైగానే ఈ ఎన్నికలో మునుగోడు సీటుకోసం పోటీ పడుతున్నారు. సరిగ్గా చూసుకుంటే ఈ ఎన్నికకు ఈ రోజు మరియు ఎన్నికలు జరగబోయే రోజును వదిలేస్తే ఇక మిగిలి ఉంది కేవలం అయిదు రోజులు మాత్రమే.

ఎన్నిక సమీపిస్తుండడంతో అన్ని పార్టీలు ప్రచారంలో హుషారుగా పాల్గొంటున్నాయి. తెలంగాణాలో జరిగిన మూడు ఉప ఎన్నికలలో రెండు సార్లు బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. ఇప్పుడు కూడా ఈ సీటు మాదే అంటూ ప్రచారంలో మరియు మీడియా సమావేశాల్లో ఆ పార్టీ నాయకులు చెప్పుకుని తిరుగుతున్నారు. కానీ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం తెలుస్తున్నది ఏమిటంటే... మునుగోడు ఎన్నికలో అసలు పోటీ కేవలం కాంగ్రెస్ మరియు తెరాస ల మధ్యనే ఉండబోతోందని తెలుపుతున్నారు. కానీ కొన్ని సర్వేలు చెబుతున్న ప్రకారం బీజేపీ కి కూడా గెలుపు అవకాశాలు ఉన్నాయట.

ఇక ఈ ఎన్నిక కాంగ్రెస్ నుండి వెళ్లిపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చాలా కీలకం అని తెలిసిందే. అందుకే ఎలా అయినా మునుగోడు లో గెలిచి బీజేపీలో కీలక స్థానాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక అధికారంలో ఉన్న తెరాస కు వారు చేస్తున్న పాలన మరియు అందిస్తున్న పథకాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తాయన్నది చూడాలి. ఇక కాంగ్రెస్ కు సిట్టింగ్ స్థానం అయిన మునుగోడు లో మళ్ళీ గెలిచేది మేమే అంటూ కాంగ్రెస్ సీనియర్లు చెబుతున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు అన్నది ఇక్కడ కీలకంగా మారనుంది. ఈ విషయంలో ఒక క్లారిటీ రావాలంటే నవంబర్ 3 సాయంత్రం వరకు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: