ఆంధ్రప్రదేశ్ లో గతంలో జరిగిన ఎన్నికలలో జగన్ నేతృత్వంలోని వైసీపీ అఖండ మెజారిటీని సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే వైసీపీ కేవలం ఒక్క జగన్ వలనే అధికారంలోకి రాలేదన్నది చాలా మందికి తెలియని విషయం. అంతకు ముందు ఎన్నికల సమయంలోనూ మరియు 2019 ఎన్నికల సమయంలోనూ జగన్ కు తోడుగా ఉండి రాజకీయ వ్యూహాలు, ఎత్తులు, పై ఎత్తులు వేసి వైసీపీ ని ప్రజల్లోకి వెళ్లేలా చేశాడు. పార్టీ పెట్టిన మొదటిసారి గురి తప్పినా ఆ తరువాత మాత్రం పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అయ్యాడు.

ఈయన గతంలో ఏ విధంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా తన టీం ఐప్యాక్ ను ఉపయోగించి సర్వేలు చేయించి ప్రజల నాడిని బట్టి పార్టీ మ్యానిఫెస్టోను తయారుచేయించి గెలుపులో కీలక పాత్ర పోషించాడో, నెక్స్ట్ 2024 లో జరగనున్న ఎన్నికలకు కూడా అదే విధంగా పనిచేయనున్నాడని తెలుస్తోంది. కానీ ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ బీహార్ లో జనసురాజ్ పేరుతో పాదయాత్రను చేస్తున్నారు. ఆ కారణంగా తన సన్నిహితుడు రుషిరాజ్ సింగ్ ఐప్యాక్ టీం ను లీడ్ చేస్తున్నారట. కానీ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఈ విషయంపై చర్చ జరుగుతోంది. జగన్ సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేడా ? ప్రశాంత్ కిషోర్ సహాయం లేకుండా తానేమీ చేయలేడా ? అంటూ ఈ పాయింట్ ను తీస్తున్నారు.

అయితే గత ఎన్నికల కంటే కూడా ఈసారి ప్రశాంత్ కిషోర్ సలహాలు మరియు సూచనలకు ఎక్కువ విలువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ పై ఎక్కువగానే వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రమే వైసీపీని వ్యతిరేకించకుండా సమర్ధిస్తూ వస్తున్నారు. మరియు గ్రామాలలో ఏమంత ఎక్కువా వ్యతిరేకత లేదు. పట్టణాలలో అయితే మాములుగా వ్యతిరేకించడం లేదు.. ఇప్పటికిపుడు ఎన్నికలు పెట్టినా జగన్ కు వ్యతిరేకంగా ఓటు వేయడానికి రెడీ గా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ జగన్ కు అండగా ఉండి గెలిపిస్తే ఖచ్చితంగా ఆయన ఇంకా గొప్ప ఎన్నికల వ్యూహకర్త అని అంతా నమ్ముతారు.  

 


మరింత సమాచారం తెలుసుకోండి: