ఒక ఎన్నిక జరుగుతోంది అంటే ఫలితం వచ్చే వరకు ప్రీ ఎగ్జిట్ పోల్స్ సర్వే మరియు పోస్ట్ ఎగ్జిట్ పోల్స్ సర్వే లు అంటూ సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేస్తుంటాయి. కానీ ఎక్కువ సార్లు సర్వే లు నిజం అయిన ఉదాహరణలే ఉన్నాయి. కాగా ఇప్పుడు తెలంగాణలోని నల్గొండ జిల్లా మునుగోడే నియోజకవర్గ ఎమ్మెల్యే గా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో విబేధాల కారణంగా గత నెలల్లో పార్టీకి మరియు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. దానితో మునుగోడు లో ఉప ఎన్నిక ఖరారు అయింది. ఆ ఉప ఎన్నిక మరో రెండు రోజుల్లో జరగనుంది. ఈ రోజు సాయంత్రానికి ఎన్నికల ప్రచారానికి గడువు ముగియనుంది.

ఇక ఈ రోజు నుండి ఫలితాల తేలే వరకు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఆ పార్టీల నాయకులు మరియు కార్యకర్తలు టెన్షన్ లో ఉంటారు. కాగా పోటీలో ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం తెరాస, కాంగ్రెస్ మరియు బీజేపీ ల మధ్యనే ఉండనుంది. కాగా ఈ ఎన్నికలో ఏ పార్టీ గెలుపు సాధించాలన్నా ఈ ఓటర్లు కీలకం కానున్నారు అని ఒక వార్త వైరల్ అవుతోంది. గెలుపును నిర్ణయించేది ఒక్క ఓటు అయినా చాలా ముఖ్యం అని తెలిసిందే. ఈ విషయం చాలా సార్లు రుజువయింది కూడా ? కాబట్టి ఎన్నికల సంఘం కానీ, అభ్యర్థులు కానీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా వారిని ప్రేరేపించాలి.

కాగా ఈ మునుగోడు నియోజకవర్గంలో ఓటు హక్కును కొత్తగా తెచ్చుకున్న వారిలో ఎక్కువగా యువకులే ఉన్నారు.  ఇక్కడ మొత్తం 2 లక్షల 41 వేల మందికి ఓటు హక్కు ఉండగా, ఇందులో సగం ఓట్లు యువ ఓటర్లు ఉన్నారట. అందుకే అన్ని పార్టీలు యువకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారట. మునుగోడు 39 ఏళ్ల వయసు లోపు ఉన్న వాళ్ళు కరుణిస్తేనే ఏ పార్టీ అయినా గెలుస్తుంది. మరి వీరి మద్దతు ఏ పార్టీకి దక్కుతుందో తెలియాలంటే మరో రెండు రోజులు వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: