తెలంగాణాలో గత రెండు నెలలుగా ఎన్నో వివాదాలు, గొడవలు మిళితమైన మునుగోడు ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మొదలైన ఈ ఉప ఎన్నిక రేపటితో ముగియనుంది. నిన్న సాయంత్రమే ప్రచారానికి గడువు ముగియడంతో అందరూ రేపు జరగనున్న ఎన్నిక గురించి చర్చలు జరుపుతున్నారు. ఈ రోజు రాత్రి నుండి ఫలితాలు వచ్చే వరకు నాయకులు అందరికీ కంటి మీద కునుకు ఉండదు అని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఎన్నికలో గెలవడం బీజేపీకి మరియు కాంగ్రెస్ లకు చాలా ముఖ్యం. అందుకే గెలుపుకు అవసరం అయిన అన్ని అవకాశాలను వాడుకున్నారు.

అయితే ఎన్ని చేసినా ది జడ్జిమెంట్ డే అనేది చాలా కీలకం.. ఈ జడ్జిమెంట్ అనేది ఓటర్ల చేతిలో ఉంటుంది. ఇన్ని రోజులు ఏ పార్టీ పక్కన నిలబడి ప్రచారం చేసినా ? ఓటింగ్ ముందు రోజు రాత్రి ఏ పార్టీ దగ్గర డబ్బు తీసుకున్నా ? ఓటింగ్ రోజు బూతు లోకి వచ్చి ఓటు గుద్దే వరకు నమ్మకం లేదు. చాలా మంది విషయంలో ఇన్ని రోజులు ఒక పార్టీతో తిరిగి, తీరా ఓటు మాత్రం వేరే పార్టీకి వేస్తుంటారు. ఇలాంటివి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మరి ఓటర్లు ఏ నాయకుడిపై తమ పూర్తి భరోసా ఉంచుతారు అన్నది మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది.

ఈ ఎన్నికలో మొత్తం 47 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఓటింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభం అయ్యి సాయంత్రం 6 గంటలకు ముగియనున్నాయి. మొదటి మూడు గంటలు ఓటింగ్ కు కీలకం కానుంది. ఓటింగ్ శాతం పెరిగితే స్పష్టమైన ఫలితం వస్తుంది. అయితే ఇప్పటి వరకు వస్తున్న సమాచారం ప్రకారం ఈ ఎన్నికలో గెలిచే అవకాశం ఎక్కువగా బీజేపీకే ఉందని తెలుస్తోంది. మరి ఏమి జరగనుందో ఎన్నిక ముగిసేవరకు వేచిచూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: