అర్జంటుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయేంతవరకు పవన్ కు నిద్రపట్టేట్లుగా లేదు. ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి పదవినుండి జగన్ను దింపేద్దామా ? ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ? అని ఆతృతగా ఎదురుచూస్తున్నట్లుంది.  ఇంతకీ విషయం ఏమిటంటే తాడెపల్లి మండలంలోని ఇప్పటం గ్రామంలో రోడ్డువిస్తరణ పనులు జరుగుతున్నది. రోడ్డు విస్తరణంటే మరి రోడ్డుకు రెండువైపులా ఉన్న ఇళ్ళు లేకపోతే వాటి కాంపౌండ్ వాల్ ను కొట్టేయాల్సుంటందికదా. అధికారులు ఇపుడు అదేపని మొదలుపెట్టారు.





ఇంతలో ఇప్పటం గ్రామానికి చెందిన కొందరు వచ్చి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు.  రోడ్ల విస్తరణ పనుల్లో భాగంగా తమ ఇళ్ళను కూల్చేస్తున్న విషయాన్ని వివరించారు.  దాంతో ఒక్కసారిగా జగన్ ప్రభుత్వంపై పవన్  ఫైరయ్యారు. ‘కూల్చివేతలతో మొదలైన ఈ ప్రభుత్వం కూలిపోయే రోజు ఎంతో దూరంలో లేదు’  అంటూ శాపనార్ధాలు పెట్టారు. ఇక్కడే పవన్ మానసిక పరిస్ధితిపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.





జనాలు ఓట్లేస్తే జగన్ ముఖ్యమంత్రయ్యారు కానీ అడ్డదారుల్లోనో లేకపోతే ఎవరినో వెన్నుపోటు పొడిచే ముఖ్యమంత్రి కాలేదు. రెక్కలకష్టంమీద పార్టీకి 151 సీట్లు తెచ్చుకున్నారు. అప్పటినుండి జగన్ విజయాన్ని పవన్ తట్టుకోలేకపోతున్నారు. ఎంతసేపు జగన్ ఓడిపోవాలి, జగన్ ముఖ్యమంత్రిగా దిగిపోవాలి, జగన్ ప్రభుత్వం కూలిపోవాలి ఇదే గొడవతో పాపం పవన్ కు మానసిక ప్రశాంతత కూడా ఉండటంలేదు.





2019 ఎన్నికల సమయంలో ఎట్టిపరిస్ధితుల్లోను జగన్ను సీఎం కానివ్వనంటు చాలెంజ్ చేశారు. జగన్ అధికారంలోకి ఎలావస్తారో చూస్తానంటు సవాల్ విసిరారు. పవన్ అలా చూస్తుండగానే వైసీపీ 151 సీట్లలో గెలవటంతో జగన్ ముఖ్యమంత్రయిపోయారు. అప్పటినుండి జగన్ను చూస్తుంటే  పవన్ తట్టుకోలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లూ రావాల్సిందే అన్న టార్గెట్ తో జగన్ ముందుకుపోతున్నారు. ఇదే సమయంలో జనసేనకు ఎన్నిసీట్లు వస్తాయో కూడా పవన్ చెప్పలేకపోతున్నారు. ఈ నేపధ్యంలోనే గందరగోళం పెరిగిపోతుండటంతో పవన్ కు ఏమి మాట్లాడుతున్నారో అర్ధంకావటంలేదు. అయినా ‘పిల్లి శాపాలకు ఉట్టి తెగుతుందా’ అని పెద్దలు ఊరికే అనలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: