ఎంతో ఉత్కంఠను రేపిన మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక నేపధ్యంలో బయటకొచ్చిన ఎగ్జిట్ పోల్ అంచనాలన్నీ టీఆర్ఎస్ గెలుపునే సూచిస్తోంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమే అయితే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిది వాపే కానీ బలుపుకాదనే అనిపిస్తోంది. గెలుపుకోసం దాదాపు మూడునెలలు టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోరాటం జరిగింది. చివరలో కాంగ్రెస్ వెనకబడిపోవటంతో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రచారయుద్ధం  హోరెత్తిపోయింది. గెలుపుపై రెండుపార్టీలు ఎంతో నమ్మకాన్ని వ్యక్తంచేస్తున్నాయి. అయితే క్షేత్రస్ధాయిలో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి ఎదురైన అనుభవాలతో టీఆర్ఎస్ గెలుపు ఖాయమనే ప్రచారం పెరిగిపోయింది.





ఆ దశలన్నీ దాటిపోయి చివరకు 92 శాతం పోలింగ్ కూడా జరిగిపోయింది. సరిగ్గా అలా పోలింగ్ ముగిసిందో లేదో ఇలా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బయటకు వచ్చేశాయి. థర్డ్ విజన్ రీసెర్చ్, ఎన్ఏఎస్ గ్రూప్, నేషనల్ ఫ్యామిలి ఒపీనియన్ ఎగ్జిట్ పోల్ అనే మూడుసంస్ధలు తమ అంచనాలను రిలీజ్ చేశాయి. ఈ మూడు సంస్ధలు రిలీజ్ చేసిన అంచనాల్లో కామన్ పాయింట్ ఏమిటంటే టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డిదే  ఘనవిజయమని.





థర్డ్ విజన్ రీసెర్చ్ ప్రకారం టీఆర్ఎస్ కు 48-51 మధ్య ఓట్లు వస్తాయి. బీజేపీకి 31-35 శాతం ఓట్లొస్తాయి. ఎన్ఏఎస్ గ్రూపు అంచనా ప్రకారం టీఆర్ఎస్ కు 42 శాతం ఓట్లొస్తే, బీజేపీకి 36 ఓట్లొస్తాయి. నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ ప్రకారం టీఆర్ఎస్ కు 42 శాతం ఓట్లొస్తాయి. బీజేపీకి 35 శాతం ఒట్లొస్తాయి. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే మూడు ఒపీనియన్ పోల్స్ అంచనాల్లోను కాంగ్రెస్ కు 16 శాతం ఓట్లకన్నా రాదు. బీఎస్పీకి 5 శాతం ఓట్లొస్తాయని అంచనాల్లో తేలిందంటే మామూలు విషయంకాదు.





మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ అంచనాల ద్వారా రాజగోపాలరెడ్డి కెపాసిటి ఏమిటో బయటపడిపోయింది. పార్టీబలాన్నే తన వ్యక్తిగతబలంగా రాజగోపాల్ ఊహించుకున్నారని తేలిపోతోంది. తానులేకపోతే మునుగోడులో కాంగ్రెస్ పార్టీలేదనే భ్రమల్లో ఇంతకాలం రాజగోపాల్ రెచ్చిపోయారు. ఉపఎన్నికలో తేలబోయేదేమంటే పార్టీకన్నా రాజగోపాల్ ఎక్కువకాదని. మరిది కేవలం రాజగోపాల్ కు మాత్రమే వర్తిస్తుందా లేకపోతే ఇలాగే రెచ్చిపోతున్న అన్న, భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా వర్తిస్తుందా అన్నదే చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: