భూమిని నమ్ముకుని బ్రతుకుతూ ఆరుగాలం కష్టపడే రైతన్నకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే  పది మందికి అన్నం పెట్టే రైతన్న పై ప్రకృతి ఎప్పుడు పగబట్టినట్లు గానే వ్యవహరిస్తూ ఉంటుంది. ఏకంగా వేసిన పంట చేతికి వచ్చే సమయానికి భారీగా వర్షాలు పడటం లేదా ఇంకా ఏదైనా ప్రకృతి విపత్తులు తలెత్తి ఇక పూర్తిగా నష్టాలు వాటిల్లడం లాంటివి జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి.


 అయితే అటు ప్రభుత్వాలు మారుతున్న రైతుల జీవితాలలో మాత్రం వెలుగులు నిండడం లేదు. దీంతో రోజురోజుకీ నష్టాల బారిన పడుతున్న రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. ఇంకొంతమంది వ్యవసాయాన్ని వదిలేసి నగరాలకు వెళ్తూ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఆరుగాలం కష్టపడి దేశం కడుపు నింపే రైతన్నకు ఎప్పుడు సహాయంగా ఉండాలి అన్న విషయాన్ని ఇక్కడ కొంతమంది స్కూల్ విద్యార్థులు నిరూపించి శభాష్ అనిపించుకున్నారు. ఏకంగా రైతు కష్టపడి పండించిన పంటను వరుణుడి బారిన పడకుండా ఉండేలా కాపాడారు విద్యార్థులు.


 గత కొన్ని రోజుల నుంచి ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇటీవల నల్గొండ జిల్లా దోమలపల్లి గ్రామంలోని రైతులు స్థానిక ఐకెపి సెంటర్లో తమ వరి ధాన్యం ఆరబెట్టారు. కానీ ఒక్కసారిగా వర్షం పడింది. దాన్యమంతా ఆరబెట్టడంతో తడిసిపోయే పరిస్థితుల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ అటువైపుగా వెళ్తున్న స్కూల్ విద్యార్థులు ఎంతో సమయస్పూర్తిగా వ్యవహరించారు. రైతన్నకు సహాయం చేయాలని గొప్ప ఆలోచన చేసి వెంటనే ధాన్యం దగ్గరికి వెళ్లి రైతులు కష్టపడి పండించిన పంట వర్షం పాలు కాకుండా కాపాడారు విద్యార్థులు. చేసిన పనికి నెటిజన్లు సలాం కొడుతున్నారు. ఇంత చిన్న వయసులో అంత గొప్ప ఆలోచన చేయడం గ్రేట్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: