నిన్న తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాలు ఎంతో మందికి కనువిప్పును కలిగించి ఉంటాయి. గత కొంతకాలంగా తెలంగాణాలో పాలన సరిగా లేదని, కేసీఆర్ ను గద్దె దించాలని ఎంతోమంది బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. అందుకు తగినట్లుగానే తెరవెనుక వ్యూహాలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఎప్పుడైతే మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడిందో, అప్పటి నుండి ఈ ఉప ఎన్నిక విజయ మాదే అంటూ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ బాకాలు ఊదింది. అయితే వాస్తవ రూపం మాత్రం దానికి పూర్తి వ్యతిరేకంగా మారింది.

ఇంతకు ముందు చాలా సార్లు రేవంతన్న మీటింగ్ లలో తెలంగాణాలో కేసీఆర్ సామ్రాజ్య పతనానికి  మేమె నాంది అంటూ ప్రగల్భాలు పలికారు... అంతే కాకుండా తెరాస కు ప్రత్యామ్నాయ పార్టీ కూడా కాంగ్రెస్ అని ఊదరగొట్టారు. కానీ కాంగ్రెస్ కు అంత దమ్ము లేదని.. లోపల లోపల పదవుల కోసం కొట్లాడడమే నాయకులకు తెలుసని మరోసారి ఋజువయింది. మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ కు సిట్టింగ్ స్థానం అని తెలిసిందే. అందుకే ఖచ్చితంగా గెలుస్తామని రేవంత్ అండ్ కో రేయింపవళ్ళు కలలు కన్నారు. కానీ కాంగ్రెస్ కు కనీసం డిపాజిట్లు కూడా దక్కకపోవడం చాలా నిరాశను కలిగించే విషయం.

ఈ ఎన్నికలో తెరాస అభ్యర్థి విజయకేతనాన్ని ఎగురవేయగా, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండవ స్థానానికి పరిమితం అయ్యాడు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మూడవ స్థానానికి పడిపోయారు. దీనిని బట్టి రానున్న ఏ ఎన్నికల్లో అయినా బీజేపీని సవాలుగా తీసుకోవాలని కేసీఆర్ కు ఒక హెచ్చరిక ఈ ఫలితం అని చెప్పాలి. పదివేల ఓట్లతో స్పస్టమైన మెజారిటీ వచ్చినా బీజేపీ మొదటి మూడు రౌండ్ లలాగా ఓట్లు సంపాదించి ఉంటే తెరాస కు ఓటమి ఖాయం. దీనితో కేసీఆర్ తో ఢీ కొట్టాలంటే తెలంగాణలో బలమైన రెండవ పార్టీ బీజేపీ అని ప్రూవ్ అయింది. కాంగ్రెస్ విషయంలో ఏదైనా గొప్ప అద్భుతం జరిగితే తప్ప పుంజుకోవడం చాలా కష్టం.


మరింత సమాచారం తెలుసుకోండి: