మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి అతికష్టంమీద 10,309 ఓట్ల మెజారిటితో గెలిచారు. నిజానికి ఎలక్షన్ గనుక ఫెయిర్ గా జరిగుంటే కూసుకుంట్ల ఓడిపోయేవారనటంలో సందేహంలేదు.  క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను దృష్టిలో పెట్టుకున్న కేసీయార్ ముందుజాగ్రత్తగా వామపక్షాలతో పొత్తులు పెట్టుకున్నారు. అప్పటికీ కూసుకుంట్లకు బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డిరాజగోపాలరెడ్డి ముచ్చెమటలు పట్టించారు. యావత్ అధికారయంత్రాంగాన్ని వాడుకుని, వామపక్షాలను పక్కనపెట్టుకుని, మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులందరినీ రంగంలోకి దింపినా కూసుకుంట్ల గెలిచింది 10 వేల మెజారిటీతోనే అని గమనించాలి.





ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ కీలకపాత్ర పోషించినట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే మొదటినుండి కూడా కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి గెలుస్తుందని ఎవరు అనుకోలేదు. పోటీ రాజగోపాలరెడ్డి-కూసుకుంట్లే అని తేలిపోయింది. ఇక్కడే కాంగ్రెస్ ప్లే చేసిన గేమ్ కారణంగానే కూసుకుంట్ల గెలిచారనే ప్రచారం పెరిగిపోతోంది. ఇంతకీ ఆ గేమ్ ప్లాన్ ఏమిటంటే తాను ఓడిపోయినా పర్వాలేదు రాజగోపాల్ మాత్రం గెలవకూడదని. కాంగ్రెస్ ఎంఎల్ఏగా ఉంటు బీజేపీతో ఒప్పందంచేసుకుని రు. 18 వేలకోట్ల కాట్రాక్టు తీసుకుని ఎంఎల్ఏ పదవికి రాజగోపాల్ రాజీనామా చేశారు.





ఇది సరిపోదన్నట్లు రాజగోపాల్ అన్న, భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో వెన్నుపోటు. బొగ్గుగనుల కాంట్రాక్టుకోసం పార్టీకి తమ్ముడు వెన్నుపోటు పొడిస్తే, పార్టీలోనే ఉంటు తమ్ముడి గెలుపుకు అన్న పార్టీకి వెన్నుపోటుపొడిచారు. దాంతో కాంగ్రెస్ సీనియర్లందరికీ బాగా మండింది. కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకున్నారు.






అందుకనే పోలింగుకు ముందు తమ ఓట్లలో కొన్నింటిని టీఆర్ఎస్ కు వేయించినట్లు ప్రచారం జరుగుతోంది. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ను ఓడించేందుకు బీజేపీకి ఓట్లేయించినట్లే మునుగోడులో బీజేపీని ఓడించేందుకు టీఆర్ఎస్ కు ఓట్లేయించారట. దీనివల్లే అతికష్టం మీద టీఆర్ఎస్ గెలిచిందనే టాక్ పెరిగిపోతోంది. అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే కాంగ్రెస్ సీనియర్లు ఎంతగా మండిపోతున్నారో అర్ధమవుతోంది. కాంగ్రెస్ సహకరించకపోతే టీఆర్ఎస్ గెలిచేది కాదేమో అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: