మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి గెలిచినప్పటికీ డేజంర్ బెల్స్ అయితే మోగినట్లే అనుకోవాలి. అధికారంలో ఉన్నపార్టీ తరపున పోటీచేసిన కూసుకుంట్ల 10 వేల ఓట్ల మెజారిటితో గెలవటం పెద్ద గొప్పేమీకాదు. ఇదే సందర్భంలో ప్రతిపక్ష బీజేపీ అభ్యర్ధిగా పోటీచేసిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి 80 వేల చిల్లర ఓట్లు రావటమంటే మామూలు విషయంకాదు. నిజంగానే టీఆర్ఎస్ కు వామపక్షాల మద్దతులేకపోయుంటే కూసుకుంట్ల ఓడిపోయేవారే అనటంలో సందేహంలేదు.





కూసుకుంట్ల గెలుపు పెద్ద గెలుపేకాదని  ఎందుకు చెబుతున్నామంటే మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు, ఎంఎల్సీలతో పాటు స్ధానిక నేతలు+యావత్ అధికారయంత్రాంగమంతా టీఆర్ఎస్ గెలుపుకు పనిచేసింది. ఇంతమంది కలిసి దాదాపు రెండునెలలు నానా అవస్తలుపడితే గెలిచింది 10 వేల ఓట్ల మెజారిటితోయేనా ? ఇదే విధమైన ఎలక్షనీరింగ్ ను కేసీయార్ సాధారణ ఎన్నికల్లో చేయగలరా ? ఒకే ఒక ఉపఎన్నిక కాబట్టి మొత్తం శక్తినంతా మునుగోడు మీద కేంద్రీకృతం చేయగలిగారు.





అదే సాదారణ ఎన్నికల్లో 119 నియోజకవర్గాలపైనా దృష్టిపెట్టాలి. అప్పుడు ఈ స్ధాయిలో ఏ నియోజకవర్గంలోను చేయలేరు. ఎందుకంటే ఎన్నికల సమయంలో యావత్ యంత్రాగమంతా కేంద్ర ఎన్నికల కమీషన్ పరిధిలోకి వెళిపోతుంది. పైగా టీఆర్ఎస్ గెలుపు అనుమానమే అని గనుక ఉద్యోగులకు అనిపిస్తే అధికారపార్టీ నేతలు ఎంత అరిచీ గీపెట్టినా లెక్కచేయరు. పైగా అధికారంలోకి వస్తుందని అనుకునే పార్టీకి అనుకూలంగా మారినా ఆశ్చర్యపోవక్కర్లేదు.





ఈ నేపధ్యంలో కేసీయార్ మంత్రాంగం అన్నీ నియోజకవర్గాల్లోను పనిచేయదు. కాబట్టి అధికారపార్టీ అభ్యర్ధులకు ఎదురుదెబ్బలు తగిలినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇక్కడే మునుగోడు ఉపఎన్నిక కేసీయార్ కు డేంజర్ బెల్స్ లాగ పనిచేస్తోందని చెబుతున్నది. పార్టీలో లోపాలేవన్నా ఉంటే ఇపుడే సరిచేసుకోవాలి. లేకపోతే సాధారణ ఎన్నికల్లో సరిచేసుకునే అవకాశముండదు. అప్పుడు పెద్ద దెబ్బతగిలితే ఇక కోలుకోవటం అన్నది ఉండదు. ఇప్పటి గెలుపుతో గర్వం తలెకెక్కితే ఎవరు చేయగలిగేదేమీ ఉండదు. అలాకాకుండా ప్లస్సులెక్కడ, మైనస్సులెక్కడ అన్నది జాగ్రత్తగా చూసుకుంటే రేపటి ఎన్నికల్లో మైనస్సులను సరిచేసుకునేందుకు సమయం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: