తాజాగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే 2024 లో జరగనున్న ఎన్నికలు చాలా కఠినంగా ఉండనున్నాయని మాత్రం అవగతం అవుతోంది. ముఖ్యంగా జగన్ , పవన్ మరియు చంద్రబాబు ల మధ్య జరగనున్న ఈ మూడు స్థంభాలాటలో గెలుపు ఎవరిది అన్నది ప్రజలే నిర్ణయించాల్సి ఉండగా, ఆ ప్రజలను తమకు అనుకూలముగా మార్చుకోవడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నారు ఈ ముగ్గురు నాయకులు. జగన్ సంక్షేమాన్ని మరోసారి పెద్దపీటగా ప్రజల ముందుకు వెళుతుంటే.. చంద్రన్న మాత్రం జగన్ ను విమర్శించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళుతున్నారు. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఎలాగైనా జగన్ ప్రభుత్వాన్ని కూలదోయడమే పనిగా పెట్టుకున్నట్లు క్లియర్ గా అర్ధమవుతోంది.

ఇటీవల ఇప్పటం గ్రామంలో జరిగిన సంఘటన దీనికి రుజువు అని చెప్పాలి. ఒక రాజకీయ నాయకుడు అన్న మాటను మరిచిపోయి ప్రభుత్వం , సీఎం , పోలీసు వ్యవస్థ ఇలా దేనినీ లెక్క చేయకుండా తాను చేస్తున్న వ్యాఖ్యలు జనసైనికులకే నచ్చడం లేదన్నది బయట వినిపిస్తున్న టాక్. ఇక వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఒక హామీని పవన్ ప్రజలకు ఇచ్చారు . అయితే దీనిపై రాజకీయంగా హాట్ చర్చ జరుగుతోంది. పవన్ మాట్లాడుతూ నేను కనుక సీఎం అయితే సిపిఎస్ ను రద్దు చేస్తానని ప్రకటించి అటు జగన్ , చంద్రబాబు మరియు ఎంతో మందికి ఆశ్చర్యాన్ని కలిగించాడు. తాను గెలిచిన మరుక్షణమే రెండవ సంతకం ఈ ఫైలు మీదే చేస్తానని హామీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఏపీలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా, అందులో కొన్ని ప్రభుత్వాలు ఈ హామీ ఇచ్చినప్పటికీ ప్రాక్టికల్ గా దీనిని నెరవేర్చడం కుదరలేదు.

ఈ విషయంపై రాష్ట్రంలోని నాలుగున్నర లక్షల మంది ఉద్యోగులు అసహనంగా ఉన్నారు.. ప్రభుత్వం దృష్టికి పలుమార్లు ఈ విషయాన్ని తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. ఒకవేళ ఇది కనుక నెరవేరిస్తే రాష్ట్రం ఆర్ధికంగా ఎంతో వెనుకబడిపోతుందని భావించి ఈ సాహసం చేయలేకపోతున్నారు. ఇవన్నీ తెలిసే పవన్ ఈ హామీ ఇచ్చాడా లేదా బలమైన హామీ ఇస్తే ప్రజల్లో అటెన్షన్ వస్తుందని ఇలా చేశాడా అని రాజకీయ విశ్లేషకులు తలలు పీక్కుంటున్నారు. వీరు చెబుతున్న ప్రకారం ఒకవేళ పవన్ సీఎం అయినా ఈ హామీని నెరవేర్చడం కష్టమే అంటూ తేల్చి పారేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: