మునుగోడు అసెంబ్లీఉపఎన్నిక రిజల్టు వచ్చిన మూడోరోజే ఈ  సందేహం మొదలవ్వటం ఆశ్చర్యంగానే ఉంది. దీనికి కారణం ఏమిటంటే బీజేపీ సీనియర్ నేతలతో పాటు అగ్రనేతలపైన ఓడిపోయిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం మొదలైంది. టీఆర్ఎస్ భారీ మెజారిటితో గెలిచుంటే అది వేరేకథగా ఉండేది. కానీ కోమటిరెడ్డి ఓడిపోయింది కేవలం 10 వేల ఓట్ల తేడాతోనే కావటంతో అసంతృప్తి పెరిగిపోతోందట. పార్టీ నాయకత్వం గట్టిగా మద్దతిచ్చుంటే తాను గెలిచుండేవాడినని కోమటిరెడ్డి అనుకుంటున్నట్లు సమాచారం.





ఇక అసలు విషయానికి వస్తే బీజేపీ మీద పూర్తి కమిట్మెంట్ ఉన్నవారు తప్ప ఈ పార్టీలో ఇమడలేరు. ఇప్పటికే అనేకమంది విషయంలో ఇదిరుజువైంది. ఈమధ్యనే పార్టీలోకి ఇలావచ్చిన వారు కొద్దిరోజుల్లోనే మళ్ళీ అలా వెళిపోయారు. కోమటిరెడ్డి వైఖరి అచ్చంగా వ్యాపారం, కాంట్రాక్టులు, డబ్బులకు మాత్రమే కట్టుబడుంటాడని అందరికీ తెలిసిందే. మునుగోడులో గెలిచుంటే ఎలాగూ కంటిన్యు అయ్యుండేవాడే. ఇపుడు ఓడిపోయాడు అందులోను ఓటమి విషయంలో బాగా అసంతృప్తిగా ఉన్నాడు కాబట్టి ఎప్పుడే నిర్ణయం తీసుకుంటాడో తెలీదు.





ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కోమటిరెడ్డి లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు కాంగ్రెస్ లో తప్ప ఇంకేపార్టీలోను ఇమడలేరు. బీజేపీలాంటి పార్టీలో ఉండాలంటే సద్దుకునిపోయే గుణముండాలి. కోమటిరెడ్డికి ఆ గుణమేలేదు. తనమాటే చెల్లుబాటు కావాలనే మనస్తత్వం చాలా ఎక్కువ. మొన్నటి హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలిచిన ఈటల రాజేందరే పార్టీలో ఇమడలేకపోతున్నాడనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఈటలకు పార్టీచీఫ్ బండిసంజయ్ కి మధ్య ఆధిపత్యపోరు నడుస్తున్నదనే ప్రచారముంది.





పార్టీ నేతలు సరిగా పట్టించుకోకపోవటం వల్లే తాను ఓడిపోయాననే అసంతృప్తిగనుక రాజగోపాలరెడ్డిలో పెరిగిపోతే బీజేపీలో ఎక్కువరోజులుండలేరన్నది వాస్తవం. అప్పుడు మళ్ళీ కాంగ్రెసే దిక్కవుతుంది. తీసుకున్న కాంట్రాక్టులు తదితరాల వల్ల ఇప్పటికిప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లో చేరకపోవచ్చుకానీ ఎన్నికలకు ముందైనా తప్పేట్లులేదు. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి కూడా రాజగోపాలరెడ్డిని చేర్చుకునేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎంతోమంది నేతలు కాంగ్రెస్ పై బండలేసి వెళ్ళారు. వెళ్ళినపార్టీల్లో ఇమడలేక మళ్ళీ వచ్చి చేరిపోయారు. కాబట్టి అలాంటివారిలో కోమటిరెడ్డి కూడా ఒకళ్ళవుతారంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: