జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాజకీయసోపానానికి నిచ్చెనగా ఉపయోగపడుతుందని ఎల్లోమీడియాను నమ్ముకున్నట్లున్నారు. అసలు మీడియా అన్నదే భస్మాసురహస్తం లాంటిది. మీడియాను ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించుకోవాలి. అలాకాదని ఓవర్ యాక్షన్ చేసేసి నెత్తిన పెట్టేసుకుంటే అదే మీడియా భస్మాసురహస్తంలాగ మారిపోతుంది. 2019 ఎన్నికల్లో చంద్రబాబునాయుడుకు జరిగిందిదే. అయినా ఫార్టీ ఇయర్స్ కు జ్ఞానోదయం అయినట్లులేదు.





సరే చంద్రబాబంటే రాజకీయంగా చివరిఅంకంలో ఉన్నారు కాబట్టి ఏమైనా పెద్దగా నష్టంలేదు. కానీ పవన్ అలాకాదు ముఖ్యమంత్రయిపోవాలని పెద్ద పెద్ద కలలు కంటున్నారు. కలలు నిజం కావాలంటే నమ్ముకోవాల్సింది జనాలనే కానీ మీడియాను అందులోను ఎల్లోమీడియాను కానేకాదు. ఇదంతా ఇపుడెందుకంటే ఎల్లోమీడియాను చూసుకునే వైజాగ్ లో అయినా ఇప్పటం గ్రామంలో అయినా పవన్ చాలా ఓవర్ చేశారు. ఎల్లోమీడియా కూడా పవన్ ఓవరాక్షన్ కు తగ్గట్లుగానే బ్రహ్మాండమైన భజనచేసింది.





దీనికి కొనసాగింపుగా ఇప్పటం గ్రామంలో ఇళ్ళు కోల్పోయిన వారందరికీ తలా లక్ష రూపాయలు ఇవ్వబోతున్నట్లు పవన్ ప్రకటించారు. కష్టాల్లో ఉన్నవారికి సాయంచేయటంలో తప్పేమీలేదు. కానీ ఇళ్ళు కూలకపోయినా కూలిపోయిన ప్రతి ఇంటికీ లక్ష రూపాయలని పవన్ ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది.  తమ ఇళ్ళను ఎవరూ కూల్చలేదని తమకు ఎవరి సాయం అవసరంలేదని గ్రామస్తులు ఇళ్ళముందు బోర్డులు పెట్టేశారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఎల్లోమీడియా కూడా బ్యానర్ కథనం  హెడ్డింగుల్లో 53 ఇళ్ళు కూలిపోయినట్లు పెద్దపెద్ద అక్షరాలతో చెప్పింది. కానీ లోపలేమో చిన్న అక్షరాల్లో ఇళ్ళముందున్న నిర్మాణాలు, ప్రహరిగోడలను మాత్రమే కూల్చినట్లు రాసింది.





ఇళ్ళముందున్న నిర్మాణాలు, ప్రహరీ గోడలంటేనే అర్ధమైపోతోంది ఇళ్ళను కూల్చలేదని. ప్రభుత్వం కూడా మొదటినుండి ఇదే మొత్తుకుంటోంది. రోడ్డును ఆక్రమించి కట్టుకున్న  కాంపౌండ్ వాల్స్ ను మాత్రమే తాము తొలగించామని ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు సాక్ష్యాలుగా ఫొటోలను కూడా చూపిస్తోంది. అయినా ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా మాత్రం 53 ఇళ్ళను కూల్చేసినట్లు గోలగోల చేశాయి. చివరకు ఇదే ఎల్లోమీడియా కథనాల్లోపల మాత్రం ఇళ్ళముందున్న నిర్మాణాలు, ప్రహరీగోడలను మాత్రమే కూల్చినట్లు చెప్పింది. అంటే లోపలొకటి బయటకొకటి అన్నట్లుగా రాస్తోంది ఎల్లోమీడియా. దీన్నిగనుక పవన్ నమ్ముకుంటే ముణిగిపోవటం ఖాయం.



మరింత సమాచారం తెలుసుకోండి: