ఆర్బీఐ నియమాల ప్రకారం.. ప్రతి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ లను పెంచిన విషయం తెలిసిందే..మే 2022 తర్వాత bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును పదే పదే పెంచుతూ వస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఎన్నో ప్రముఖ బ్యాంకులు అన్నీ వడ్డీ రేట్లను పెంచెసాయి..మే నుంచి ఆర్బీఐ రెపో రేటును మొత్తం 190 బేసిస్ పాయింట్లు పెంచింది. చాలా మంది రుణదాతలు ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై 7 శాతం కంటే ఎక్కువ వడ్డీని చెల్లిస్తున్నారు.


సెప్టెంబర్ 2022లో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్ట స్థాయి 7.4 శాతానికి చేరుకుంది. అటువంటి పరిస్థితిలో ఫిక్స్డ్ డిపాజిట్లు చాలా మందికి మంచి పెట్టుబడి ఎంపిక. మీరు కూడా రాబోయే రోజుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు ఏ బ్యాంకుల్లో మూడు సంవత్సరాల పీఫ్డీపై ఉత్తమ వడ్డీ రేటును అందుకుంటారొ ఇప్పుడు చుద్దాము..

బంధన్ బ్యాంకు: ఈ ప్రైవేట్ బ్యాంక్లో మీరు ప్రస్తుతం మూడేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.00 శాతం వడ్డీని పొందుతారు.
సిటీ యూనియన్ బ్యాంక్: ఈ బ్యాంక్ మూడు సంవత్సరాల కాలవ్యవధితో ఎఫ్డీలపై 7.00 శాతం వడ్డీ రేటును కలిగి ఉంది.
AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ప్రస్తుతం, ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో మూడేళ్ల కాలవ్యవధితో ఎఫ్డీపై 7.50 శాతం వడ్డీ రేటు అందుబాటులో ఉంది.
డీసీబీ బ్యాంక్: ప్రస్తుతం ఈ ప్రైవేట్ బ్యాంక్లో మూడేళ్ల ఎఫ్డీపై 7.50 శాతం వడ్డీ అందుతోంది.
అదేవిధంగా..కరూర్ వైశ్యా బ్యాంక్ అదే వడ్డీని అందిస్తుంది..


ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చొని పోస్టాఫీసులో ఆన్‌లైన్‌లో ఎఫ్‌డీ ఖాతాను తెరవవచ్చు. దీని కోసం మీరు పోస్టాఫీసుకు కూడా వెళ్లవలసిన అవసరం లేదు. ఎందుకంటే బ్యాంక్ లాగానే పోస్టాఫీసు కూడా మీకు ఒక సంవత్సరం, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్లపాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ సౌకర్యం కల్పిస్తుంది. పోస్టాఫీసు ఫిక్స్‌డ్ డిపాజిట్లను టైమ్ డిపాజిట్లు అంటారు. పోస్ట్ ఆఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ వార్షిక ప్రాతిపదికన చెల్లించబడుతుంది, అయితే త్రైమాసిక ప్రాతిపదికన లెక్కించబడుతుంది. మీరు పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్‌లో ఒక సంవత్సరం పాటు డబ్బును డిపాజిట్ చేస్తే 5.50% మీకు వడ్డీ వస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: