మోదీ ప్రభుత్వం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకొని వస్తుంది..ఇప్పటికే ఎన్నో పథకాల వల్ల చాలా మంది ప్రజలు లబ్ది పొందారు.చిరు వ్యాపారుల కోసం 'పీఎం స్వనిధి పథకం' ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది..ఈ పథకం కింద మొదట వ్యాపారులకు రూ.10,000 లోన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు చిరు వ్యాపారులకు రూ.50,000 వరకు రుణాలు ఇస్తోంది. కరోనా వల్ల కారణంగా దెబ్బతిన్న వ్యాపారులు తిరిగి తమ వ్యాపారాలు ప్రారంభించడానికి ఆర్థికంగా అండగా ఉండటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. 



వీధుల్లో చిన్నచిన్న షాపులు నిర్వహించేవారు, చిరు వ్యాపారులకు రుణాలను అందిస్తోంది. అయితే ఈ పథకంపై అవగాహన లేక చిరు వ్యాపారులు ప్రయోజనం పొందలేకపోతున్నారు.కేంద్ర ప్రభుత్వం 2022 నవంబర్ 18 నాటికి రూ.5,000 కోట్లకు పైగా రుణాలను ఈ పథకం ద్వారా మంజూరు చేయడం విశేషం. మొత్తం 57,48,287 దరఖాస్తులు రాగా, 42,11,076 దరఖాస్తులకు ఆమోదముద్ర వేసింది. 37,03,529 దరఖాస్తుదారులకు రుణం మంజూరు చేసింది. మొత్తం రూ.5,064.88 కోట్లు మంజూరు చేయగా అందులో రూ.4,241.23 కోట్లు చిరు వ్యాపారుల అకౌంట్లలో జమ అయ్యాయి. 


దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోనే రుణం మంజూరు చేస్తున్నాయి బ్యాంకులు. పీఎం స్వనిధి పోర్టల్‌లో రియల్‌టైమ్ డేటా అందుబాటులో ఉంది.మొదట ఇచ్చిన 10 వేలు కరెక్ట్ గా కడితే రెండో సారి 20000 ఇస్తారు..అది కరెక్ట్ గా కడితే 50 వేలు మూడోసారి ఇస్తారు.వార్షిక వడ్డీ 7 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్ పద్ధతిలో పేమెంట్స్ చేస్తే వడ్డీ సబ్సిడీ లభిస్తుంది.


ఎలా అప్లై చెయ్యాలంటే..


ముందుగా http://pmsvanidhi.mohua.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి I am not a robot పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత Request OTP బటన్ పైన క్లిక్ చేయాలి.
మొబైల్ నెంబర్‌కు వచ్చిన 6 అంకెల ఓటీపీ ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత Verify OTP పైన క్లిక్ చేయాలి.
ఓటీపీ సక్సెస్‌ఫుల్‌గా వెరిఫై అయిన తర్వాత రెండో కేటగిరీ ఉంటుంది.
స్ట్రీట్ వెండర్ కేటగిరీ సెలెక్ట్ చేయాలి.
ఆ తర్వాత ఇతర వివరాలు ఎంటర్ చేసి ఫామ్ పూర్తి చేయాలి.దరఖాస్తు విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంకు లోన్ అప్లికేషన్‌ను ప్రాసెస్ చేస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: