డబ్బులను సంపాదించాలని ప్రతి ఒక్కరికి వుంటుంది.. కాలు చెయ్యి పని చేసి సంపాదిస్తె వృద్ధాప్యంలో సుఖంగా బ్రతకవచ్చునని చాలా మంది భావించి పొదుపు పథకాల లో ఇన్వెస్ట్ చేస్తారు.చాలామంది ఆరోగ్య అవసరాలు, నిత్యావసరాలకు ఇబ్బంది పడకుండా ముందు నుంచే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటారు.ఎటువంటి స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..



అయితే అన్ని స్థాయిల్లోనూ ఉద్యోగులకు డబ్బు సేవ్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. అయితే ప్రైవేటు ఉద్యోగులు కూడా ప్రణాళిక బద్ధంగా, క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేస్తే.. రిటైర్మెంట్ తర్వాత పెద్ద మొత్తంలో ఆర్థిక ప్రయోజనాలు అందుకునే అవకాశం ఉంది. తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి మంచి రాబడిని అందుకునే మార్గాలు ఏంటి.. ఎలా ఇన్వెస్ట్ చేయాలో చుద్దాము..ప్రైవేట్ సెక్టార్లో పని చేసే వారు తమ రిటైర్మెంట్ తర్వాత జీవితానికి పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చుకోవడం చాలా కష్టం. ఇలాంటి వారికి దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడిని ఇచ్చే రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రూమెంట్ అవసరం.



రిటైర్మెంట్ తర్వాత మంచి ఆదాయాన్ని పొందాలంటే ప్రైవేట్ రంగ ఉద్యోగులు వీలైనంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. నేషనల్ పెన్షన్ సిస్టమ్లో 26 సంవత్సరాల వయస్సులో నెలకు రూ.4000 పెట్టుబడి పెట్టడం ప్రారంభించి, 60 సంవత్సరాల వయస్సు వరకు పెట్టుబడిని కొనసాగిస్తే.. ఆ తర్వాత నెలవారీ పెన్షన్గా రూ.35,000 కంటే ఎక్కువ సంపాదించవచ్చు. ఇక్కడ చేసిన ఇన్వెస్ట్మెంట్కి 11 శాతం వడ్డీని పొందవచ్చు.



ఇకపోతే ఒకేసారి రాబడి రూ.1,06,70,932 అయితే నెలవారీ పెన్షన్ దాదాపు రూ. 35,570 అందుకుంటారు. వయస్సు 61 సంవత్సరాలు దాటిన తర్వాత నెలకు దాదాపు రూ.35,000 పెన్షన్ అందుకుంటారు. అంతే కాకుండా రూ.కోటి మొత్తాన్ని ఒకేసారి పొందుతారు. దీంతో రిటైర్మెంట్ను సులువుగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది.
రాబడి రూ.1,06,70,932 అయితే నెలవారీ పెన్షన్ దాదాపు రూ. 35,570 అందుకుంటారు. వయస్సు 61 సంవత్సరాలు దాటిన తర్వాత నెలకు దాదాపు రూ.35,000 పెన్షన్ అందుకుంటారు. అంతే కాకుండా రూ.కోటి మొత్తాన్ని ఒకేసారి పొందుతారు. దీంతో రిటైర్మెంట్ను సులువుగా పొందవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: