బీజేపీ చీఫ్ సోమువీర్రాజు మాటలు విన్నవారికి ఇదే అనుమానం వస్తుంది. ఒక చానల్ తో వీర్రాజు మాట్లాడుతు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జేనసేన, బీజేపీ మైత్రి, ఎన్నికల్లో కలిసి పోటీచేసే విషయాలపై యాంకర్ అనేక ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలకు వీర్రాజు సమాధానమిస్తు పవన్ బీజేపీతోనే ఉంటారు, మమ్మల్ని వదిలి ఎక్కడికీ పోరు అని గట్టిగా చెప్పారు.





ఇంతవరకు ఓకేనే ఎందుకంటే తమను వదలి పవన్ ఎక్కడికీ వెళ్ళరనే నమ్మకం వీర్రాజులో బలంగా ఉందనే అనుకుంటారు. అయితే ఇదే విషయమై వీర్రాజు మాట్లాడుతు మమ్మల్ని పవన్ ఎక్కడికి వెళ్ళరు, వెళ్ళలేరు కూడా అన్నారు. బీజేపీని వదిలి పవన్ వెళ్ళలేకుండా మేము చేసుకుంటాం అని చెప్పటమే అందరికీ ఆశ్చర్యంగా ఉంది. బీజేపీని వదిలి పవన్ వెళ్ళకుండా వీర్రాజు ఏమి చూసుకుంటారు ? అన్నదే అందరిలో మెదులుతున్న ప్రశ్న.





బీజేపీ నచ్చకపోతే పవన్ ఎప్పుడైనా సంబంధాలు తెంపుకోవచ్చు కదా ? మరలాంటపుడు తమను వదిలి పవన్ ఎక్కడికి వెళ్ళలేరని, అలా వెళ్ళలేకుండా తాము చూసుకుంటామని వీర్రాజు చెప్పటం ఏమిటో ఎవరికీ అర్ధంకావటంలేదు. ఇక్కడే పవన్ను బీజేపీ బ్లాక్ మెయిల్ చేస్తోందా అనే సందేహం పెరిగిపోతోంది. పవన్ను బీజేపీ బ్లాక్ మెయిల్ చేయటమే నిజమైతే ఏ విషయంలో బ్లాక్ మెయిల్ చేస్తోందనే సందేహాలు పెరిగిపోతున్నాయి.





బీజేపీ ప్రధాన టార్గెట్ ఏమిటంటే పవన్ను టీడీపీతో పొత్తుపెట్టుకోకుండా ఆపటమే. నరేంద్రమోడీతో భేటీ తర్వాత టీడీపీ విషయమై పవన్ ఎక్కడా మాట్లాడటంలేదు. అయితే ఇదే సమయంలో బీజేపీనే తమ మిత్రపక్షమని, బీజేపీతోనే తాను వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటామని కూడా పవన్ ఎక్కడా చెప్పటంలేదు. దీంతోనే కమలనాదుల్లో పవన్ వైఖరిపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికి కాస్త కామ్ గా ఉన్నా సరిగ్గా ఎన్నికలకు ముందు పవన్ ఏం చేస్తారో అనే అనుమానాలు ఉన్నట్లున్నాయి. ఇందులో భాగంగానే బయటకు కనబడని ఏదో విషయాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ పవన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లే ఉంది.                                                                                                  

మరింత సమాచారం తెలుసుకోండి: