ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు తమ కస్టమర్లను అలర్ట్ చేస్తుంది..పలు రకాల కొత్త స్కీమ్ లను అందిస్తూ లాభాలను పొందేలా చేస్తుంది.అందుకు ముందు నుంచే మనీ సేవ్‌ చేస్తారు. ఈ అవకాశం అందరికీ ఉండకపోవచ్చు.ఎలాంటి మనీ సేవ్‌ చేసుకోని వృద్ధులకు సొంతిల్లు ఉంటే అదనపు ఆదాయ వనరులను పొందే అవకాశం ఉంది. ఇప్పుడు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రివర్స్ మార్ట్‌గేజ్ లోన్ ఫెసిలిటీ ద్వారా సొంత ఇల్లు ఉన్న సీనియర్ సిటిజన్‌లకు అదనపు ఆదాయ వనరును అందిస్తోంది.


వారికి వారు పోషించుకోవడానికి తగిన ఆదాయ వనరులు లేని వృద్ధులకు రివర్స్‌ మార్టిగేజ్‌ లోన్‌ ఉపయోగపడుతుందని ఎస్బీఐ పేర్కొంది. రివర్స్ మార్ట్‌గేజ్ లోన్ కింద ఎస్బీఐ సీనియర్‌ సిటిజన్‌ల ఇంటిని తనఖా పెట్టుకుని లోన్‌ అందిస్తుంది. రుణగ్రహీతను తన జీవితకాలంలో రుణం తిరిగి చెల్లించమని బలవంతం చేయమని బ్యాంక్‌ తెలిపింది. అయితే రుణగ్రహీతకు రుణాన్ని తిరిగి చెల్లించే అవకాశం ఉందని చెప్పింది. ఈ స్కీమ్‌ గురించి సీనియర్‌ సిటిజన్‌లు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు చూద్దాం..


రుణగ్రహీత మరణించిన తరువాత, బ్యాంకు ఆస్తిని విక్రయిస్తుంది. ఆస్తిని ఎక్కువ ధరకు విక్రయిస్తే అది రుణగ్రహీత చట్టబద్ధమైన వారసులకు బ్యాలెన్స్‌ని తిరిగి ఇస్తుంది. ప్రత్యామ్నాయంగా చట్టపరమైన వారసులు రుణాన్ని బ్యాంకుకు తిరిగి చెల్లించి, ఇంటిని తిరిగి పొందే అవకాశం కూడా ఉంటుంది. సీనియర్ సిటిజన్లు తమ లోన్‌ను పెనాల్టీలు లేకుండా ముందస్తుగా చెల్లించవచ్చు. రుణగ్రహీతలకు నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక, వార్షిక లేదా ఏకమొత్తం చెల్లింపు ఆప్షన్లు ఉంటాయి.


రివర్స్ మార్ట్‌గేజ్ లోన్ సౌకర్యం ద్వారా కనీస మొత్తం రూ.3 లక్షలు, గరిష్టంగా రూ. కోటి అందుకోవచ్చు. రుణం తీసుకున్న వారి వయస్సును బట్టి లోన్‌ టెన్యూర్‌ 10 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉంటుంది.. 60 సంవత్సరాల వయస్సు గల ఇండియన్స్ రివర్స్ మార్ట్‌గేజ్‌ లోన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దంపతులు ఇద్దరూ ఉంటే.. జీవిత భాగస్వామి వయస్సు 58 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి. ఇక sbi లోన్ మొత్తంలో 0.50 శాతాన్ని ప్రాసెసింగ్ ఫీజుగా వసూలు చేస్తుంది. ఇది కనిష్టంగా రూ.2000, గరిష్టంగా రూ.20,000 ఉండవచ్చు, పన్నులు వర్తిస్తాయి.. ఈ లోన్ పై ప్రస్తుతం 10.95 శాతం వడ్డీ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: